Skip to main content

Posts

Showing posts from October, 2020

అందమైన మరియు మెరిసే ముఖం కోసం ఈ చిట్కా పాటించండి - Follow this tip for a beautiful and shiny face

సాధారణంగా ప్రతి ఒక్కరు వారి యొక్క ముఖం అందంగా ఉంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నో రకాల క్రీములను ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు మనం ఇటువంటి రసాయనాలు లేకుండా మీ ముఖాన్ని అందంగా మెరిసే లాగా చేయడం ఎలాగో తెలుసుకుందాం. మీరు చేయవలసిందల్లా రాత్రిపూట పడుకునే ముందు ముఖాన్ని మంచి నీటితో శుభ్రంగా కడుక్కొని, శుభ్రమైన మెత్తని గుడ్డతో బాగా తుడుచుకోవాలి, తరువాత స్వచ్ఛమైన బాదం నూనెను కొద్దిగా తీసుకొని, ముఖం మీద అప్లై చేస్తూ వలయాకారంలో రుద్దుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే సున్నిపిండితో ముఖాన్ని కడుక్కోవాలి, ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేసినట్లయితే మీ యొక్క ముఖం మీద ఉన్నటువంటి నల్లటి వలయాలు మటుమాయమై మీ చర్మం నిగనిగలాడుతూ మెరిసిపోతుంది.