Skip to main content

Posts

Showing posts with the label INCREDIBLE THINGS

బార్-కోడ్ అంటే ఏమిటి, బార్-కోడ్ చరిత్ర మరియు అది ఎలా పనిచేస్తుంది? - What is BAR-CODE and how it works?

what is barcode & how barcode works in Telugu బార్-కోడ్ అంటే ఏమిటి? సాధారణంగా మనం మార్కెట్ నుండి ఖరీదు చేసే ప్రతీ వస్తువు మీద లేదా దాని కవర్ మీద నిలువుగా, తెలుపు మరియు నలుపు రంగులలో ఉండేటటువంటి గీతాలను గమనించే వుంటాం. ఆ గీతలనే బార్-కోడ్స్ అని అంటారు. ఈ బార్-కోడ్స్ లలో ఆయా వస్తువులకు సంభందించిన వివరాలు ఉంటాయి. ఈ బార్-కోడ్ లో ఉండేటటువంటి డేటాను స్కానర్ లేదా మెషిన్ రీడర్ సహాయంతో తెలుసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే దృశ్య రూపంలో మెషిన్ రీడబుల్ ప్రక్రియ ద్వారా వస్తువు యొక్క వివరాలను తెలిపే విధానము.  బార్-కోడ్ చరిత్ర బార్-కోడ్ ఆవిష్కరణకు ముందు ఏదైనా ప్రొడక్ట్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు, ఆ ప్రొడక్ట్ యొక్క తయారీదారుడికి ఎన్ని ప్రొడక్ట్స్ అమ్ముడుపోయాయో మరియు ఎన్ని ప్రొడక్ట్స్ నిల్వ వున్నాయో తెలిసేది కాదు. దీని కారణంగా ఆ తయారీదారుడు అన్ని ప్రొడక్ట్స్ ని అనగా అమ్ముడుపోయినవి మరియు నిల్వ ఉన్నవి కూడా తయారు చేసేవాడు. దీంతో ఆ కంపెనీలకు చాలా నష్టం చేకురేది. 1948 లో ఒక సూపర్ మార్కెట్ యొక్క "Executive manager" "Drexel University" కి వెళ్లి ఆ "College" యొక్క...

తమిళనాడు లోని ఒక గ్రామంలో ప్రజలు 35 రోజులపాటు వీది దీపాలను ఆపివేసారు ఎందుకో తెలుసా? - Tamil Nadu Village peoples Turns Off Street Lights For Over 35 Days ...

Street lights off for 35 days in tamilnadu  image credit: common.wikipedia.org సాధారణంగా మనం ఇంటి బయట రోడ్డు మీద ఉన్న వీది దీపాలు ఒక్క నిమిషం పాటు ఆగిపోతేనే  ఆ చీకట్లో వెళ్ళడానికి భయపడతాం, అంతేకాదు ఆ కరెంట్ అపివేసినవాడిని ఒక రకంగా తిట్టుకుంటాం కూడా. అటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఒక గ్రామంలో ఉన్న ప్రజలే స్వయంగా కొన్ని రోజుల పాటు వీది దీపాలను ఆపివేయాలని నిర్ణయించుకున్నారు .  ఆశ్చర్యంగా ఉందా! అవునండి మీరు విన్నది నిజమే స్వయంగా ఆ ఊరి ప్రజలే కొన్ని రోజుల పాటు వీది దీపాలను ఆపివేయాలని నిర్ణయిచుకున్నారు. ఇక వివరాలలోకి వెళితే. తమిళనాడు రాష్ట్రంలో శివగంగా జిల్లాలోని పోతకుడి గ్రామంలో గల వీది దీపాలకు సంబంధించిన మెయిన్ స్విచ్ బోర్డు దగ్గర " రాబిన్ పక్షి"  తన నివాసాన్ని ఏర్పరుచుకొని, అందులో గుడ్లు కూడా పెట్టింది. " కరుప్ప రాజా" అనే కళాశాల విద్యార్ధి చాలాకాలం నుండి ఈ ప్రాంతంలో వీది దీపాలను నిర్వహించే భాద్యతను వహిస్తున్నాడు. వీది చివరలో ఉన్న తన ఇంటి ప్రక్కనే వీది దీపాలకు సంభందిచిన ప్రధాన స్విచ్ బోర్డు ఉన్నది. ఇతను ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు స్విచ్ బోర్డు వద్దకు వె...

సిలికా జెల్ అంటే ఏమిటి? మరియు వాటి యొక్క ఉపయోగాలు - what is silica gel and there uses?

what is silica gel and there uses - Image by Ann San from Pixabay   సాధారణంగా మనం ఏదైనా వస్తువులను కొన్నప్పుడు, ఉదాహరణకు బూట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు, మెడిసిన్,  లేదా కొన్ని రకాలైన ఫుడ్ ఐటమ్స్, అవి ఉంచే బాక్స్ లలో ఒక తెల్లని ప్యాకెట్ ఉండడం గమనించేవుంటారు. ఆ ప్యాకేట్స్ అలా ఎందుకు పెడతారో చాల మందికి తెలియదు. ఐతే ఆ పాకెట్స్ పెట్టడానికి గల కారణం మరియు వాటిలో ఉండేటటువంటి చిన్న చిన్న గుండ్రని పూసల వలన ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. మనం ఏదైనా షూ దుకాణం కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి నచ్చిన షూ ఉంటే దానిని ప్యాక్ చేయమని చెబుతాం. ఆ దుకాణదారుడు షూ ని ప్యాక్ చేసే సమయంలో షూ లో లేదా దాని యొక్క బాక్స్ లో తెలుపు రంగులో ఉండేటటువంటి గుండ్రని చిన్న బ్యాగ్ ని కూడా ఉంచుతాడు. ఇంటికి రాగానే బాక్స్ ఓపెన్ చేసి షూ మాత్రమే తీసుకోని అందులో ఉండే తెల్లని బ్యాగ్ వలన మనకు ఎటువంటి ఉపయోగం లేదనుకొని బయట పడేస్తాం.  అసలు ఆ బ్యాగ్ ఎందుకు ఇస్తారు, మరియు దాని వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే  ఇంకెప్పుడు ఆ బ్యాగ్ ని బయట పడేయకుండా, దాచుకొని, అవసరమైనప్పుడు  ఉపయోగిస్తారు....

తల లేకుండా 18 నెలలు బ్రతికిన కోడి! - Mike the Headless Chicken!

వినడానికి వింతగా ఉన్నా, ఇదే నిజం!. తల లేకుండా ఒక కోడి 18 నెలలు బ్రతికింది. సాధారణంగా ఏ ప్రాణి కుడా తన తల లేకుండా కొన్ని నిముషాలు కూడా జీవించలేదు. అలాంటిది, ఒక కోడి తన తల లేకుండా 18 నెలలు బ్రతికిందంటే చాల ఆశ్చర్యంగా ఉంది కదా!. వివరాలలోకి వెళితే, అమెరికాలోని Fruita, Colorado వద్ద Lloyd Olsen అనే ఒక రైతు తన భార్య Clara తో కలిసి వారి జీవన ఆధారమైన ఒక కోళ్ళఫారం నడిపేవారు. అంతేకాకుండా చుట్టుపక్కల నివసించే వారికి అమ్ముతూ డబ్బు సంపాదిస్తూ వారి యొక్క జీవనం సాగించేవారు. దీనికోసం వారు ప్రతీ రోజు 40 నుండి 50 వరకు కోళ్లను చంపుతూ ఉండేవారు.  ఒక రోజు అనగా, 1945 వ సంవత్సరం సెప్టెంబర్ 10 వ తేదిన ఎప్పటిలాగే చికెన్ సప్లై చేయడానికి Lloyd Olsen మరియు అతని భార్య Clara కలిసి కోళ్లను చంపుతున్నారు. అలా చంపిన ప్రతీ కోడిని ఒక డబ్బాలో వేసేవారు. ఎందుకంటే? సాధారణంగా కోడిని నరికిన తరువాత అది కొంతసేపు (అంటే తన ప్రాణం విడిచేవరకు) గిలగిల కొట్టుకుంటుంది. దీనికి కారణం కోడి నుండి తల వేరుచేసాక తన వెన్నుముక లో ఉండే సర్క్యుట్స్ లలో కొంతసేపటికి వరకు ఆక్సిజన్ మిగిలి ఉంటుంది. ఆ ఆక్సిజన్ కారణంగా కోడి ...

ప్రపంచంలోని ఏకైక పబ్లిక్ డైమండ్ మైన్ గా పిలువబడే పార్క్ - "Crater of Diamonds State Park" - anyone can mine the diamond in the public park!

యునైటెడ్ స్టేట్స్ లోని ఆర్కాన్సాస్ యొక్క " Crater of Diamonds State Park" ప్రపంచంలో వజ్రాలు ఉత్పత్తి చేసే ఏకైక ప్రదేశం , ఇది ఇక పబ్లిక్ డైమండ్ మైన్ , అంటే ఇక్కడికి వచ్చి ఎవరినా సరే వజ్రాల కోసం మైనింగ్ చేసుకోవచ్చు. డైమండ్ మైనింగ్ కు కావలిసిన పరికరాలు పార్క్ వద్ద అద్దెకు లిడ కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి పాలసీ " Finders, Keepers" మన భాషలో చెప్పాలంటే "మీరు కనుగొన్న వజ్రాలు మీవే" అని అర్ధం. ఇక్కడ ఉన్నటువంటి 37.5 ఎకరాల దున్నిన పొలాలం వజ్రాల కోసం శోదించవచ్చు. ఇది పురాతన వజ్రాలను కలిగి ఉన్న అగ్ని ప్రర్వత బిలం యొక్క క్షిణించిన ఉపరితలం. 1906 లో John Huddleston అనే రైతు ఈ వజ్రాలు కలిగి ఉన్నటువంటి కొంత స్థలానికి యజమాని. ఈయనే మొట్ట మొదటి వజ్రని కనుగొన్నాడు. ఈ Crater of Daimonds చాలా సంవత్సరాలు చేతులు మారి మరియు అనేక కంపెనీలు వాణిజ్య వజ్రాల తవ్వకాలపై విఫల ప్రయత్నాలు చేశాయి. ఈ తవ్వకాల వలన లాభాలు లేకపోవడం మరియు మంటలు సంభవించడం వంటివి ఈ వైఫల్యానికి కారణాలు. 1952 నుండి 1972 వరకు ఈ ప్రదేశం పర్యాటక ఆకర్షణగా ప్రైవేట్ గా నిర్వహించబడుతుంది. ఐతే 1...

Feviquick అది నింపిన కంటైనర్ తో ఎందుకు అతుక్కోదు? - Why Feviquick does not stick to the inside of its bottle?

సాదారణంగా మనం ఏదైనా వస్తువులు విరిగినప్పుడు వాటిని అతికించడానికి   Feviquick ని ఉపయోగిస్తాం. దీనిని ఉపయోగించి, ప్లాస్టిక్ , వుడ్ , లేదర్ , మెటల్ , రబ్బర్ & సిరామిక్ మొదలైన   వాటిని అతికించి తిరిగి సాదారణ రూపానికి తిసుకోనిరావచ్చు. కేవలం 5 సెకండ్ల లోనే ఆ విరిగిన వస్తువు అతుక్కుంటుంది.   అంత   Powerful అయినటువంటి ఈ Feviquick అది ఉండే బాటిల్ కి మాత్రం అతుక్కోదు. దీనికి కారణం ఆ కంటైనర్ లో Feviquick తో పాటు సైనోఅక్రిలేట్ అనే కెమికల్ ని కలుపుతారు. ఈ కెమికల్   Feviquick లోని అణువులను కలవనివ్వకుండా చేస్తుంది. ఐతే   ఈ Feviquick కంటైనర్ నుండి బయటకు తీసినప్పుడు సైనోఅక్రిలేట్ అనే కెమికల్ గాలిలో ఆవిరైపోయిన తరువాత Feviquick లోని అణువులు ఒకదానితో మరొకటి గట్టిగా అతుక్కుంటాయి. ఈ విదమైన స్థితిలో   ఉన్న Feviquick తో విరిగిపోయిన వస్తువులను మనం అతికించవచ్చు.