తమిళనాడు లోని ఒక గ్రామంలో ప్రజలు 35 రోజులపాటు వీది దీపాలను ఆపివేసారు ఎందుకో తెలుసా? - Tamil Nadu Village peoples Turns Off Street Lights For Over 35 Days ...
![]() |
Street lights off for 35 days in tamilnadu image credit: common.wikipedia.org |
ఆశ్చర్యంగా ఉందా! అవునండి మీరు విన్నది నిజమే స్వయంగా ఆ ఊరి ప్రజలే కొన్ని రోజుల పాటు వీది దీపాలను ఆపివేయాలని నిర్ణయిచుకున్నారు. ఇక వివరాలలోకి వెళితే.
తమిళనాడు రాష్ట్రంలో శివగంగా జిల్లాలోని పోతకుడి గ్రామంలో గల వీది దీపాలకు సంబంధించిన మెయిన్ స్విచ్ బోర్డు దగ్గర "రాబిన్ పక్షి" తన నివాసాన్ని ఏర్పరుచుకొని, అందులో గుడ్లు కూడా పెట్టింది. "కరుప్ప రాజా" అనే కళాశాల విద్యార్ధి చాలాకాలం నుండి ఈ ప్రాంతంలో వీది దీపాలను నిర్వహించే భాద్యతను వహిస్తున్నాడు. వీది చివరలో ఉన్న తన ఇంటి ప్రక్కనే వీది దీపాలకు సంభందిచిన ప్రధాన స్విచ్ బోర్డు ఉన్నది. ఇతను ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు స్విచ్ బోర్డు వద్దకు వెళ్లి ఆన్ చేసేవాడు, అదేవిదంగా వాటిని ఆఫ్ చేయడానికి ఉదయం 5 గంటలకు అక్కడికి వెళ్ళేవాడు. ఐతే లాక్ డౌన్ సమయంలో ఒక రోజు మధ్యాహ్నం ఇంటి నుండి బయటకు వచ్చినప్పడు, నీలం రంగులో ఉన్న ఒక పక్షి అటుగా ఎగరడం గమనించాడు. అప్పడు అతను ఆసక్తిగా ఆ పక్షిని చూడడానికి దగ్గరకు వెళ్ళాడు. అప్పడు ఆ పక్షి కొన్ని పుల్లలను మరియు స్ట్రా లను సేకరించడం గమనించాడు. ఆ పక్షి తనకోసం ఒక గూడును నిర్మించుకొంటుందని గ్రహించాడు. తరువాత అతను రాబిన్ పక్షి గూడులో గుడ్లను గమనించాడు. అతను ఆ పక్షికి మరియు దాని గుడ్లకు ఎటువంటి నష్టం జరగకుదడనే ఉద్దేశ్యంతో ఆ విషయాన్ని whatsapp ద్వారా అందరికి తెలియపరిచాడు. మరియు పంచాయతి పెద్దలకు తెలియజేసాడు. వారు అక్కడికి వెళ్లి చూడగా ఆ పక్షి చిన్న చిన్న పుల్లలు మరియు స్ట్రా లతో కట్టిన గూడులో గుడ్లు ఉండడం గమనించారు.
లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు పడ్డ భాదను చూసిన ఆ ఊరి ప్రజలు, మరియు పంచాయితీ పెద్దలు అందరూ ఒక మాట మీద నిలబడి ఆ పక్షి యొక్క గుడ్లు పొదిగే వరకు వీది దీపాలను వెలిగించకూడదని నిర్ణయిచుకున్నారు. ఐతే అ పక్షి యొక్క గుడ్లు పొదగడానికి 35 రోజుల సమయం పట్టింది. ఈ విధంగా ఆ ఊరిలో 35 రోజులపాటు వీది దీపాలు ఆపివేశారు.
లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు పడ్డ భాదను చూసిన ఆ ఊరి ప్రజలు, మరియు పంచాయితీ పెద్దలు అందరూ ఒక మాట మీద నిలబడి ఆ పక్షి యొక్క గుడ్లు పొదిగే వరకు వీది దీపాలను వెలిగించకూడదని నిర్ణయిచుకున్నారు. ఐతే అ పక్షి యొక్క గుడ్లు పొదగడానికి 35 రోజుల సమయం పట్టింది. ఈ విధంగా ఆ ఊరిలో 35 రోజులపాటు వీది దీపాలు ఆపివేశారు.
Comments
Post a Comment