![]() |
what is silica gel and there uses - Image by Ann San from Pixabay |
సాధారణంగా మనం ఏదైనా వస్తువులను కొన్నప్పుడు, ఉదాహరణకు బూట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు, మెడిసిన్, లేదా కొన్ని రకాలైన ఫుడ్ ఐటమ్స్, అవి ఉంచే బాక్స్ లలో ఒక తెల్లని ప్యాకెట్ ఉండడం గమనించేవుంటారు. ఆ ప్యాకేట్స్ అలా ఎందుకు పెడతారో చాల మందికి తెలియదు. ఐతే ఆ పాకెట్స్ పెట్టడానికి గల కారణం మరియు వాటిలో ఉండేటటువంటి చిన్న చిన్న గుండ్రని పూసల వలన ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.
మనం ఏదైనా షూ దుకాణం కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి నచ్చిన షూ ఉంటే దానిని ప్యాక్ చేయమని చెబుతాం. ఆ దుకాణదారుడు షూ ని ప్యాక్ చేసే సమయంలో షూ లో లేదా దాని యొక్క బాక్స్ లో తెలుపు రంగులో ఉండేటటువంటి గుండ్రని చిన్న బ్యాగ్ ని కూడా ఉంచుతాడు. ఇంటికి రాగానే బాక్స్ ఓపెన్ చేసి షూ మాత్రమే తీసుకోని అందులో ఉండే తెల్లని బ్యాగ్ వలన మనకు ఎటువంటి ఉపయోగం లేదనుకొని బయట పడేస్తాం.
అసలు ఆ బ్యాగ్ ఎందుకు ఇస్తారు, మరియు దాని వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే ఇంకెప్పుడు ఆ బ్యాగ్ ని బయట పడేయకుండా, దాచుకొని, అవసరమైనప్పుడు ఉపయోగిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా వివరాలలోకి వెళితే .
ఆ తెల్లటి బ్యాగ్ లో ఉండే చిన్న చిన్న గుండ్రని పూసలను "సిలికా జెల్" అని అంటారు. సాధారణంగా ఈ సిలికా జెల్ అనేది "సిలికాన్ డయాక్సైడ్" తో తయారవుతుంది. ఇది నీలం, తెలుపు, మరియు ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఈ సిలికా జెల్ అనేది ప్రొడక్ట్స్ లను గాలిలో ఉండే తేమ నుండి కాపాడుతుంది. ఇదేవిధంగా కొన్ని రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ కంటైనర్ లలో దీనిని ఉంచడం వలన కంటైనర్ లో గల ఫుడ్ "బాక్టీరియా" భారిన పడకుండా ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా మనం ఉపయోగించే లగేజ్ బ్యాగ్ లలో ఈ సిలికా జెల్ ని ఉంచినట్లయితే ఆ బ్యాగ్ లో ఉండే వస్తువులు, మరియు బట్టలు ఫ్రెష్ గా ఉంటాయి. ఒక్కోసారి మీ జిమ్ బ్యాగ్ లో ఉండే బట్టలు తేమ కారణంగా దుర్వాసన వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఐ సిలికా జెల్ ని జిమ్ బ్యాగ్ లో ఉంచినట్లయితే ఆ తేమ ని గ్రహించి మీ జిమ్ బ్యాగ్ ని ఫ్రెష్ గా ఉంచుతాయి. అలాగే మెడిసిన్స్ లో, కాస్మోటిక్స్ లో, ఎలెక్ట్రానిక్ వస్తువులలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు.
![]() |
what-to-do-if-you-drop-your-phone-in-the-water |
ఒకవేళ మీ మొబైల్ ఫోన్ నీటిలో గాని పడినట్లయితే, నీటిలో నుండి బయటకు తీసిన వెంటనే మీ మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసి, ఏడు లేదా ఎనిమిది సిలికా జెల్ బ్యాగ్ లను మరియు మీ మొబైల్ ఫోన్ ను ఒక ప్లాస్టిక్ జిప్పర్ బాగ్ లో కనీసం 24 లేదా 48 గంటలు ఉంచినట్లయితే మీ ఫోన్ లోకి చేరిన నీటినంతా ఆ సిలికా జెల్ గ్రహిస్తుంది.
అంతేకాకుండా మీ దగ్గర ఉన్న వెండి జ్యుయలరి డిఫెరెంట్ కలర్ లోకి మారకుండా ఈ సిలికా జెల్ కాపాడుతుంది. ఈసారి ఎప్పుడైనా ఏదైనా ప్రొడక్ట్ కొన్నప్పుడు ఈ సిలికా జెల్ బ్యాగ్ లు బయట పడేయకుండా ఎక్కడైనా దాచి ఉంచినట్లయితే మీకు అవసరమైనప్పుడు చాల బాగా ఉపయోగపడతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సిలికా జెల్ బ్యాగ్ లను చిన్న పిల్లలకు, మరియు పెంపుడు జంతువులకు దూరంగా ఉంచడం మరచిపోవద్దు.
అంతేకాకుండా మీ దగ్గర ఉన్న వెండి జ్యుయలరి డిఫెరెంట్ కలర్ లోకి మారకుండా ఈ సిలికా జెల్ కాపాడుతుంది. ఈసారి ఎప్పుడైనా ఏదైనా ప్రొడక్ట్ కొన్నప్పుడు ఈ సిలికా జెల్ బ్యాగ్ లు బయట పడేయకుండా ఎక్కడైనా దాచి ఉంచినట్లయితే మీకు అవసరమైనప్పుడు చాల బాగా ఉపయోగపడతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సిలికా జెల్ బ్యాగ్ లను చిన్న పిల్లలకు, మరియు పెంపుడు జంతువులకు దూరంగా ఉంచడం మరచిపోవద్దు.
Really great article, You write so amazing. I provide all digital marketing related services like and others services too.
ReplyDeleteOff Page SEO,On Page SEO,Increase Your Blog Traffic
Feel Free to ask for help.
osm
ReplyDelete