బార్-కోడ్ అంటే ఏమిటి, బార్-కోడ్ చరిత్ర మరియు అది ఎలా పనిచేస్తుంది? - What is BAR-CODE and how it works?
![]() |
what is barcode & how barcode works in Telugu |
సాధారణంగా మనం మార్కెట్ నుండి ఖరీదు చేసే ప్రతీ వస్తువు మీద లేదా దాని కవర్ మీద నిలువుగా, తెలుపు మరియు నలుపు రంగులలో ఉండేటటువంటి గీతాలను గమనించే వుంటాం. ఆ గీతలనే బార్-కోడ్స్ అని అంటారు. ఈ బార్-కోడ్స్ లలో ఆయా వస్తువులకు సంభందించిన వివరాలు ఉంటాయి. ఈ బార్-కోడ్ లో ఉండేటటువంటి డేటాను స్కానర్ లేదా మెషిన్ రీడర్ సహాయంతో తెలుసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే దృశ్య రూపంలో మెషిన్ రీడబుల్ ప్రక్రియ ద్వారా వస్తువు యొక్క వివరాలను తెలిపే విధానము.
బార్-కోడ్ చరిత్ర
బార్-కోడ్ ఆవిష్కరణకు ముందు ఏదైనా ప్రొడక్ట్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు, ఆ ప్రొడక్ట్ యొక్క తయారీదారుడికి ఎన్ని ప్రొడక్ట్స్ అమ్ముడుపోయాయో మరియు ఎన్ని ప్రొడక్ట్స్ నిల్వ వున్నాయో తెలిసేది కాదు. దీని కారణంగా ఆ తయారీదారుడు అన్ని ప్రొడక్ట్స్ ని అనగా అమ్ముడుపోయినవి మరియు నిల్వ ఉన్నవి కూడా తయారు చేసేవాడు. దీంతో ఆ కంపెనీలకు చాలా నష్టం చేకురేది. 1948 లో ఒక సూపర్ మార్కెట్ యొక్క "Executive manager" "Drexel University" కి వెళ్లి ఆ "College" యొక్క "dean" తో తన సమస్య గురించి మాట్లాడుతూ, ఒకవేళ ప్రొడక్ట్స్ కి కోడ్ సిస్టమ్ ఉన్నట్లతే ప్రొడక్ట్స్ ని ట్రాక్ చెయ్యడం సులభంగా ఉంటుందని చెప్పాడు. వీరిద్దరి మాటలను "Norman Joseph Woodland" అనే వ్యక్తి విని, వెంటనే తన స్నేహితుడు మరియు సహఉద్యోగి అయిన "Bernard Silver" తో విషయం చెప్పి ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని చెప్తాడు. తరువాత వీరిద్దరు కలిసి "Ultraviolet Ink" ఉపయోగించి కోడ్ తయారు చేద్దామనుకున్నారు కాని అది కొంచెం ఖర్చుతో కూడుకున్నది మరియు ఆ కోడ్ త్వరగా చెరిగిపోతాది. ఐతే కోడ్ ఆవిష్కరణ భవిష్యత్తులో ఒక మార్గదర్శకం అవుతుందని ఆలోచించి, Woodland తాను పని చేస్తున్న "Drexel University" లో పని మానివేసి బార్-కోడ్ కాన్సెప్ట్ మీద పని చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఇతను "Morse Code" కాన్సెప్ట్ తీసుకోని బార్-కోడ్ ని తయారుచేయడం మొదలుపెట్టాడు. "Morse Code" అంటే టెలీకమ్యూనికేషన్ లో అక్షరాలను రెండు వేర్వేరు సిగ్నల్ వ్యవధ్యుల ప్రామాణిక సీక్వెన్స్ లుగా ఎన్కోడ్ చేయడానికి ఉపయోగించే ఒక పద్దతి. వీటిలో "Dashes and Dots" ని ఉపయోగిస్తారు.
ఒకరోజు Woodland సముద్ర తీరాన కూర్చొని అతని చేతి వ్రేళ్ళతో ఆ ఇసుక లో నిలువుగా గీతలను గీసాడు. అవి చూడగానే Woodland కు ఒక ఐడియా వచ్చింది. "Morse Code" ఉన్న "Dashes and Dots" లకు బదులు సన్నని మరియు లావైన నిలువుగా ఉండే గీతలను ఉపయోగించి కోడ్స్ తయారుచేయవచ్చు అని అనుకున్నాడు. Woodland మరియు Sivler లు కలిసి అక్టోబర్ 20, 1949 లో "Classifiying Apparatus and Method" అనే పేరు తో పేటెంట్ హక్కును నమోదు చేయించారు. ఈ పేటెంట్ ను అక్టోబర్ 7, 1952 లో Issue చేసారు. అది సర్కులర్ ఆకారంలో ఉండేది.
1951 లో Woodland "IBM" కంపెనీలో చేరాడు. అదే సమయంలో Woodland మరియు Sivler లు IBM కంపెనీని బార్-కోడ్ స్కాన్ చేసే టెక్నాలజీని తయారుచేయమని అడిగారు. ఐతే ఆ సమయంలో బార్-కోడ్ స్కానర్ తయారుచేసే టెక్నాలజీ లేకపోవడంతో "IBM" బార్-కోడ్ స్కానర్ ని తయారుచేయలేకపోయింది. 1952 లో Woodland తన అవిష్కరణ పేటెంట్ ను "Philco" కంపనీకు $15000 డాలర్లకు అమ్మేశాడు. అదే సంవత్సరంలో Philco కంపెనీ "Radio Corporation of America" (RCA) కు ఆ పేటెంట్ ని అమ్మేసింది. తరువాత RCA 1960 లో కమర్షియల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ప్రయత్నించింది. 1969 లో ఆ పేటెంట్ యొక్క గడువు కూడా పూర్తి అయిపోయింది.
RCA తరువాత 1969 లో "National Association of Food Chains" (NAFC) ఆ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఒక కమిటీ ని ఏర్పాటు చేసింది. 1971 లో IBM కూడా పాల్గొంది. మరియు Woodland కూడా ఈ టెక్నాలజీ డెవలప్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

1974 లో న్యూయార్క్ చెందిన "George Joseph Laurer" అనే వ్యక్తి Universal Product Code (UPC) అనే బార్-కోడ్ ని కనుగొన్నారు.
1974 లో మొట్ట మొదటిగా ఒహియో సూపర్ మార్కెట్ లో ఒక చూయింగ్ గమ్ ప్యాకెట్ మీద బార్-కోడ్ ను స్కాన్ చేసారు.
అంతేకాకుండా ఈ చూయింగ్ గమ్ ప్యాకెట్ ను "National Museum of American History" లో ఉంచారు.
ఈ UPC బార్-కోడ్ అనేది 12 డిజిట్ నెంబర్. దీనిని అమెరికా మరియు కెనడా లలో గల అన్ని రకాల రిటైల్ ప్రొడక్ట్స్ కి వాడుతారు. తరువాతికాలంలో యూరప్, ఆసియ, మరియు ఆస్ట్రేలియా లో డిమాండ్ పెరగడంతో దేశం యొక్క కోడ్ ని జతచేర్చి "EAN" కోడ్స్ అనగా "European Article Number" ని క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. ఈ "EAN" 13 డిజిట్స్ ని కలిగి ఉంటుంది. దీనినే ఇప్పుడు "International Article Number" అని అంటున్నారు.
మన ఇండియా లో అన్ని రిటైల్ ప్రొడక్ట్స్ కి ఈ "EAN" 13 BARCODES ఉపయోగిస్తున్నారు.
మన ఇండియా లో అన్ని రిటైల్ ప్రొడక్ట్స్ కి ఈ "EAN" 13 BARCODES ఉపయోగిస్తున్నారు.
బార్-కోడ్ ఎలా పనిచేస్తుంది?
వస్తువుల మీద లేదా వాటి ప్యాక్ లా మీద ఉండే తెలుపు మరియు నలుపు గీతలను కంప్యూటర్ తో అనుసంధానించిన స్కానర్ లేదా రీడర్ సహాయంతో స్కాన్ చేస్తారు. అలా లేజర్ కిరణాలు ప్రసరింపచేసే ఈ స్కానర్ ని ఆ బార్-కోడ్ పై ఉంచినప్పుడు నలుపు రంగు గీతలు ఆ కిరణాలను గ్రహిస్తాయి, మరియు తెల్లటి గీతలు మీద లేజర్ కిరణాలు పడినప్పుడు అవి పరావర్తనం చెంది స్కానర్ లో ఉండే దర్పణం బైనరి నంబర్స్ రూపంలో గ్రహించి, కంప్యూటర్ కి పంపిస్తుంది. అప్పుడు కంప్యూటర్ స్క్రీన్ పై స్కాన్ చేసిన వస్తువు యొక్క నిక్షిప్త సమాచారం కనిపిస్తుంది. అవి ఏటంటే? ఆ వస్తువు తయారైన దేశం, తయారీ చేసిన కంపెనీ వివరాలు, వస్తువు యొక్క తయారీ తేది, మరియు వస్తువు యొక్క రేటు మొదలైనవి.
Comments
Post a Comment