“తేలు
విషం”. అవునండి మీరు విన్నది నిజమే. తేలు కుడితే
ఎంత ప్రమాదాకరమో మీఅందరికి తెలుసు, అదేవిధంగా తేలు విషం కూడా ప్రపంచంలోనే అంతే అత్యంత
ఖరీదైన ద్రవం, దీని ఖరీదు ఎంతో తెలుసా! ఒక గాలన్ అంటే 3.78 litres విలువ అక్షరాలా $39 మిలియన్ డాలర్లు. ఈ మొత్తాన్ని మన
ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రెండువందల తొంబై కోట్లు పైమాటే . ఒకవేళ
మీదగ్గర అంత డబ్బు ఉన్నప్పటికీ ఒక గాలన్ తేలు విషం కొనాలంటే అంత సులభం కాదు. ఎందుకంటే
ఒక్కసారి మిల్కింగ్ చేస్తే (పిండినట్లయితే) మీరు పొందేది ఎంతో తెలుసా కేవలం ఒక
చిన్న చుక్క, అది కూడా ఒక చక్కర పలుకు ఎంత ఉంటుదో తెలుసుగా అంత మొత్తాన్ని మాత్రమే
పొందగలం. ఐతే ఒక గాలన్ నింపడానికి ఎన్ని సార్లు మిల్కింగ్ చెయ్యాలో తెలుసా! 2.64 మిలియన్ సార్లు మిల్కింగ్ చేయాలి. సంఖ్యల్లో చెప్పాలంటే ఇరవై ఆరు లక్షల
నలబై వేల సార్లు మిల్కింగ్ చెయ్యాలన్నమాట.
మీరు అనుకోవచ్చు ఇంత కష్టపడి మరియు ఇంత ఖర్చు పెట్టి
అంత ప్రమాదకరమైన తేలు విషాన్ని తీయడం అవసరమా అని, ఐతే నిజానికి ఇంత ప్రమాదకరమైన తేలు విషం లో
ఉండేటటువంటి Components వైద్య
రంగంలో ఎంతో అద్భుతమైన మెడిసిన్ తయారీలో ఉపయోగపడుతుంది. ఈ
ద్రవం లో ఉండేటటువంటి ప్రోటీన్ కారణంగా
కీళ్ళ వాతాలను తగ్గించవచ్చని కనుగొన్నారు. అంతేకాకుండా
పేగు వ్యాధికి మరియు కొన్ని రకాల కాన్సర్ చికిత్సకు కూడా దివ్య ఔషధంగా
ఉపయోగపడుతుంది. అందువలనే ఈ అరుదైన తేలు విషం అంత ఖరీదైనది.
Comments
Post a Comment