సాధారణంగా 99 శాతం పక్షులలో వెనుకకు ఎగిరే సామర్ధ్యం ఉండదు. ఒకే ఒక పక్షి ముందుకు,
మరియు వెనుకకు గాలి యొక్క దిశకు సంబంధం లేకుండా ఎగురుతుంది. అదే "Flying Ninza". దీనినే మనం హుమ్మింగ్ బర్డ్ అని
పిలుస్తాము. ఇది ప్రపంచంలోనే అతి చిన్న పక్షి, మరియు అతి చిన్న గుడ్డు కుడా దానిదే.
మిగతా పక్షులతో పోలిస్తే వీటి కండరాలు ప్రత్యేకమైనవి.
ఈ పక్షులు గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలవు. ఇవి సెకనుకు 200 సార్లు రెక్కలాడించగలవు. ఈ పక్షులు రెక్కలు ఆడించే సమయంలో ఒక అద్భుతమైన శబ్దం వస్తుంది. అలా శ్రావ్యమైన శబ్దం రావడం వల్ల వీటికి హమ్మింగ్ బర్డ్ అనే పేరు వచ్చింది. ఈ పక్షి యొక్క కాళ్లు బలహీనంగా ఉంటాయి. ఇవి ఎక్కువ నడవలేవు అందుకే ఎక్కువగా రెక్కలు ఆడిస్తూ మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి.
ఈ పక్షులు గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలవు. ఇవి సెకనుకు 200 సార్లు రెక్కలాడించగలవు. ఈ పక్షులు రెక్కలు ఆడించే సమయంలో ఒక అద్భుతమైన శబ్దం వస్తుంది. అలా శ్రావ్యమైన శబ్దం రావడం వల్ల వీటికి హమ్మింగ్ బర్డ్ అనే పేరు వచ్చింది. ఈ పక్షి యొక్క కాళ్లు బలహీనంగా ఉంటాయి. ఇవి ఎక్కువ నడవలేవు అందుకే ఎక్కువగా రెక్కలు ఆడిస్తూ మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి.
వీటిలో మగ పక్షుల ముక్కులు కాస్త పొడుగ్గా, వాడిగా
ఉంటాయి. ఆ పదునైన ముక్కునే కత్తుల్లా వాడుకుంటాయట. న్యూ మెక్సికో స్టేట్ విశ్వవిద్యాలయానికి
చెందిన కొందరు శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలలో తెలిసిన విషయం ఏమిటంటే ఈ పక్షులు శత్రువుల
బారి నుండి కాపాడుకోవడానికి ముక్కునే ఆయుధాలలాగా ఉపయోగిస్తాయట. ఇన్నాళ్లు ఈ పక్షులు
వాటి పదునైన ముక్కుల ద్వారా పూల మకరందాన్ని మాత్రమే ఆస్వాదిస్తాయని అనుకున్నారు.
కాని ఇవి ముక్కుతో చేసే పనులను చూసి ఆశ్చర్యపోయారు. ఇవి ఒక దానితో మరొకటి గొంతుపై
ముక్కుతో పొడుచుకుంటూ పోటిపడతాయట. తమ తోటి పక్షి ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాటిని
శత్రువుల బారి నుండి కాపాడడానికి మగ పక్షులు వాటి ముక్కులతో ప్రత్యర్థుల గొంతుపై
గట్టిగా పొడుస్తూ యుద్దానికి దిగతాయి. ఇది వరకు జరిగిన పరిశోధనలలో మగ పక్షులు ఆడ
పక్షులను ఆకట్టుకోవడానికి గొంతును మారుస్తూ శబ్దాలు చేస్తాయనే సంగతి తెలిసిందే. కోస్టారికా
ప్రాంతంలో శాస్త్రవేత్తలు నాలుగేళ్ల పాటు ఈ పరిశోధనలు చేశారు. అక్కడ ఉన్నవువంటి
వివిధ వయసు పక్షుల ముక్కుల పొడవు, చురుకుదనం లాంటివి తెలుసుకొని మరీ పరిక్షించారట.
ఇటువంటి నైపుణ్యం ప్రపంచంలోని అతి చిన్న పక్షి అయిన హమ్మింగ్ బర్డ్ కి ఉండడంతో
ఆశ్చర్యపోయారు.
హమ్మింగ్ బర్డ్ యొక్క గుండె నిమిషానికి 1260 సార్లు కొట్టుకుంటుంది. ఈ
పక్షి ఒక రోజులో సుమారుగా 1500 పుష్పాల నుండి తేనెను గ్రహిస్తుంది. వీటి యొక్క బరువు 5 గ్రాముల కంటే
తక్కువ. ఈ పక్షులు
వాసనను పసిగట్టలేవు, కాని మనుషుల కన్నా బాగా వినగలవు.
అంతేకాదు వీటికి కలర్స్ చాల బాగా కనిపిస్తాయి.
Nice presentation
ReplyDelete