మన మొబైల్ ఫోన్ ఎప్పుడైనా దొంగిలించబడినప్పుడు గాని, లేక కనిపించకుండా పోయినప్పుడు గాని ఈ IMEI నెంబర్ చాలా ఉపయోగపడుతుంది.
"International Mobile Equipment Identity" యొక్కసంక్షిప్త రూపమే ఈ IMEI.
ఈ నెంబర్ ని ఉపయోగించి పోగొట్టుకున్న లేదా దొంగిలించబడ్డ మొబైల్ ఫోన్ యొక్క లొకేషన్ ట్రాక్ చేసి, ఫోన్ ఉండే ప్రదేశాన్ని కనిపెట్టవచ్చు.
రెండు Sim Card లు వున్నా ఫోన్ లలో రెండు IMEI నెంబర్లు ఉంటాయి.
మీ ఫోన్ యొక్క IMEI నెంబర్ కోసం *#06# డైల్ చేయగలరు. అంతేకాకుండా మీ ఫోన్ Settings Open చేసి About Phone క్లిక్ చేయగానే 15 సంఖ్యలతో కూడిన IMEI కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు మొబైల్ ఫోన్ కొన్నప్పుడు ఇచ్చే బిల్ మీద గాని, మొబైల్ ఫోన్ యొక్క బాక్స్ మీద గాని IMEI నెంబర్ ని చూడవచ్చు.
మీ ఫోన్ అపహరణకు గురైన సమయంలో పోలీసులను ఆశ్రయించినప్పుడు సదరు IMEI నెంబర్ FIR లో పొందుపరచవలసి ఉంటుంది. అంతేకాకుండా IMEI నెంబర్ మీ ఫోన్ కనిపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీ మొబైల్ ఫోన్ యొక్క IMEI నెంబర్ Note చేసి పెట్టుకోండి.
Comments
Post a Comment