కంప్యూటర్ లో ఉండే F1 నుండి F12 వరకు గల ఫంక్షన్ కీస్ గురించి తెలుసుకోండి - Learn about the function keys from F1 to F12 on the computer

keyboard function keys f1 to f12 in Telugu
ఫంక్షన్ కీ అంటే ఏమిటి?

సాధారణంగా కంప్యూటర్ లేదా లాప్-టాప్ కీ-బోర్డ్ లలో ఫంక్షన్ కీస్ అనేవి ఉంటాయి. ఈ ఫంక్షన్ కీస్ అనేవి F1 తో మొదలయ్యి F12 వరకు ఉంటాయి. అనగా F1, F2, F3, F4, F5, F6, F7, F8, F9, F10, F11, F12. వీటిని "ఫంక్షన్ కీస్" లేదా "F Kyes" అని కూడా పిలుస్తారు. ఈ "F కీలు" ఆపరేటింగ్ సిస్టమ్ లేదా రన్ చేయబడుతున్న ప్రోగ్రామ్ చే నిర్వహించబడే ప్రత్యేక ఫంక్షన్ ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ F కీస్ కీ-బోర్డ్ లో ఉన్నటువంటి "Alt" లేదా "Ctrl" లతో అనుసంధానం చేసి ఉపయోగిస్తారు.
కొన్ని రకాల కీ-బోర్డ్ లలో "F" కీలు స్క్రీన్ ను ప్రకాసవంతంగా మార్చడానికి లేదా తగ్గించడానికి లేదా సౌండ్ ని తగ్గించడానికి, పెంచడానికి మరియు వాటికి నిర్దేసించిన ఫంక్షన్ లను మార్చడం వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. ఐతే ఈ కీలను మీరు ప్రామాణిక ఫంక్షన్ కీ గా మార్చాలనుకుంటే కీ-బోర్డు లో ఎడమ వైపు ఇచ్చినటువంటి "Fn" కీ ని నొక్కి ఉంచి ఈ ఫంక్షన్ కీ ని నొక్కినట్లయితే ఆ ఫంక్షన్ కీ సేవ్ చేయబడి, మరియు ఆ కీ ని ఉపయోగించడానికి కాన్ఫిగర్ చేయబడిన సాఫ్ట్-వేర్ ఫంక్షన్లను ప్రేరేపితం చేస్తుంది.
కొన్ని రకాల కీ-బోర్డ్ లలో "F" కీలు స్క్రీన్ ను ప్రకాసవంతంగా మార్చడానికి లేదా తగ్గించడానికి లేదా సౌండ్ ని తగ్గించడానికి, పెంచడానికి మరియు వాటికి నిర్దేసించిన ఫంక్షన్ లను మార్చడం వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. ఐతే ఈ కీలను మీరు ప్రామాణిక ఫంక్షన్ కీ గా మార్చాలనుకుంటే కీ-బోర్డు లో ఎడమ వైపు ఇచ్చినటువంటి "Fn" కీ ని నొక్కి ఉంచి ఈ ఫంక్షన్ కీ ని నొక్కినట్లయితే ఆ ఫంక్షన్ కీ సేవ్ చేయబడి, మరియు ఆ కీ ని ఉపయోగించడానికి కాన్ఫిగర్ చేయబడిన సాఫ్ట్-వేర్ ఫంక్షన్లను ప్రేరేపితం చేస్తుంది.
కీ-బోర్డ్ లో ఫంక్షన్ కీలు ఎక్కడా ఉన్నాయి?
క్రింద ఇవ్వబడిన పిక్చర్ లో ఎరుపు రంగు గల బాణం గుర్తు క్రింద ఉన్న కీలను ఫంక్షన్ కీలు అంటారు.
![]() |
keyboard function keys from F1 to F12 in Telugu |
కంప్యూటర్ కీ-బోర్డ్ ఫంక్షన్ కీలు మరియు వాటి విధులు.
what is the use of function keys from F1 to F12 in Telugu?
F1
- దాదాపుగా ప్రతీ ప్రోగ్రామ్ లో సహాయ కీ గా ఉపయోగపడుతుంది. అనగా మీరు విండోస్ యొక్క "Help" సపోర్ట్ ఓపెన్ చేయాలనుకుంటే, కీ-బోర్డ్ లో ఉండే "Windows Button" దానితోపాటు "F1" కీని ప్రెస్ చేయాలి. లేదా ఏదైనా సాఫ్ట్-వేర్ (MS Excel, or Any other Applications) ఓపెన్ చేసినప్పుడు గాని "F1" Key Press చేసినట్లయితే "Help" సపోర్ట్ ఓపెన్ అవుతుంది. అదే లాప్-టాప్ లో ఐతే "Fn" కీని కూడా ప్రెస్ చేయవలసి ఉంటుంది.
- కొన్ని సిస్టమ్ లలో "Complementary metal–oxide–semiconductor"(CMOS) కాన్ఫిగర్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
F2
- ఈ "F2" కీని ఉపయోగించి కంప్యూటర్ లో ఉన్నటువంటి ఫైల్స్ లేదా ఫోల్డర్స్ ను "Rename" చేయవచ్చు.
- మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ (Excel, Word, PowerPoint) ఉపయోగిస్తున్నప్పుడు మరొక కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి Alt + Crtl + F2 లను ప్రెస్ చేయాలి.
- Crtl + F2 లను ప్రెస్ చేయడం వలన మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ లో ప్రింట్ ప్రివ్యూ వస్తుంది.
- మైక్రోసాఫ్ట్ Excel లో "Comments Insert" చేయడానికి Shift + F2 ప్రెస్ చేయాలి.
- Excel మరియు Powerpoint లలో Save As Option పొందడానికి Alt + F2 ప్రెస్ చేయాలి.
- కొన్ని సిస్టమ్ లలో "Complementary metal–oxide–semiconductor"(CMOS) కాన్ఫిగర్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
F3
- మైక్రోసాఫ్ట్ విండోస్ లేదా మరికొన్ని ప్రోగ్రామ్స్ లలో "Search" ఫంక్షన్ ఓపెన్ చేయడానికి F3 కీని ఉపయోగిస్తారు.
- "Excel File" లో "Insert Function" అనే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వాలంటే Shift + F3 ప్రెస్ చేయాలి.
- "Word File" లో ఉండే Text ని Lowercase నుండి Uppercase కు లేదా పదం లోని మొదటి అక్షరాన్ని "Capital letter" గా మార్చదానికి Shift + F3 ప్రెస్ చేయాలి.
- విండోస్ కమాండ్ ప్రామ్ట్ లో చివరి కమాండ్ రిపీట్ అవ్వాలంటే F3 ప్రెస్ చేస్తే చాలు.
F4
- ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో లేదా కంప్యూటర్ లో ఏదైనా ఫోల్డర్ గాని లేక My Computer ని గాని ఓపెన్ చేసినప్పుడు ఈ "F4" ప్రెస్ చేసినట్లయితే అడ్రస్ బార్ ఓపెన్ అవుతుంది.
- మైక్రోసాఫ్ట్ Word file లో చివరగా చేసినటువంటి "Action" రిపీట్ చేయడానికి F4 కీని ఉపయోగిస్తారు.
- ఓపెన్ లో ఉన్న యాక్టివ్ విండో మొత్తాన్ని ని క్లోజ్ చేయడానికి Alt +F4 ని ఉపయోగిస్తారు.
- ఓపెన్ లో ఉన్న విండోలో ఉన్నటువంటి యాక్టివ్ ట్యాబ్ ని క్లోజ్ చేయడానికి Ctrl +F4 ని ఉపయోగిస్తారు.
F5
- వెబ్ సైట్ లో గాని లేదా డెస్క్-టాప్ మీద గాని or Any Folders లో గాని "Refresh" చేయడానికి "F5" ఉపయోగిస్తాం.
- Ctrl + F5 ని ప్రెస్ చేయడం ద్వారా వెబ్ పేజి అనేది పూర్తిగా "Refresh" అవుతుంది. అంటే "caches" ని కూడా క్లియర్ చేస్తుంది
- మైక్రోసాఫ్ట్ Word లో "F5" ప్రెస్ చేయడం ద్వారా "Find and Replace" అనే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
- "PowerPoint" లో "Slideshow" ఓపెన్ చేయడానికి ఈ "F5" కీ ఉపయోగించవచ్చ.
F6
- Internet Explorer, Mozilla Firefox లేదా ఏ ఇతర బ్రౌజర్ లలో "F6" ప్రెస్ చేయగానే Cursor డైరెక్ట్ గా అడ్రస్ బార్ లోకి వెలుతుంది.
- ఓపెన్ చేసి ఉన్నటువంటి ఒక Word File నుండి మరియొక Word File లోకి Jump చేయడానికి Ctrl + F6 ఉపయోగిస్తారు.
F7
- సాధారణంగా ఈ "F7" ని ఉపయోగించి మైక్రోసాఫ్ట్ Word, Excel డాకుమెంట్స్ లలో స్పెల్లింగ్ మరియు గ్రామర్ లను చెక్ చేయవచ్చు.
- Shift + F7 ని ప్రెస్ చేయడం ద్వారా "thesaurus" డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. thesaurus అంటే Dictionary .
F8
- కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు "Safe Mode" లోకి వెళ్ళడానికి ఈ "F8" ప్రెస్ చేయాలి.
F9
- Outlook లో Shortcut లో "Send and Receive" ఆప్షన్ పొందడానికి "F9" ఉపయోగపడుతుంది.
- మైక్రోసాఫ్ట్ Word డాక్యుమెంట్ ని "Refresh" చేయడానికి ఈ "F9" ఉపయోగిస్తారు.
F10
- Mouse లో Right Click చేసినప్పుడు వచ్చే ఆప్షన్స్ ని Shift + F10 ప్రెస్ చేయడం ద్వారా పొందవచ్చు.
- కొన్ని సిస్టమ్ లలో "Complementary metal–oxide–semiconductor"(CMOS) కాన్ఫిగర్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
F11
- ఇంటర్నెట్ బ్రౌజర్ ను ఫుల్ స్క్రీన్ చేయడానికి లేదా ఫుల్ స్క్రీన్ నుండి ఎగ్జిట్ అవ్వడానికి "F11" ని ఉపయోగిస్తారు.
- మైక్రోసాఫ్ట్ Excel లో "New Sheet" ని క్రియేట్ చేయడానికి Shift + F11 ప్రెస్ చేయాలి.
- "మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్" ని ఓపెన్ చేయడానికి Alt + F11 ప్రెస్ చేయాలి.
F12
- మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ (Excel, Word, PowerPoint) ఉపయోగిస్తున్నప్పుడు మరొక కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి Crtl + F12 లను ప్రెస్ చేయాలి.
- Excel, Word మరియు Powerpoint లలో Save As Option పొందడానికి F12 ప్రెస్ చేయాలి.
- Crtl + Shift + F12 లను ప్రెస్ చేయడం వలన మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ లో ప్రింట్ ప్రివ్యూ వస్తుంది.
Comments
Post a Comment