![]() |
types of vitamins in telugu |
విటమిన్లు:
'హెచ్. జి. సర్ హాఫ్-కిన్స్' అనే శాస్త్రవేత్త మొట్ట మొదటి సారిగా విటమిన్ల మీద పరిశోధనలు చేసారు. ఈయన పాలపై అనేక పరిశోధనలు చేసి, పాలల్లో పెరుగుదలకు సంభందిచిన అనేక ఇతర పదార్దాలు ఉన్నాయని గుర్తించి వాటికీ అదనపు కారకం (కో-ఫ్యాక్టర్) అని పేరు పెట్టారు. ఆ తరువాత 1912 లో 'కాసిమర్ ఫంక్' అనే మరియొక శాస్త్రవేత్త వీటికి విటమిన్స్ అనే పేరు పెట్టడం జరిగింది. గ్రీకు భాషలో "విటా" అంటే "జీవితము" అని అర్ధం. దానిద్వారా విటమిన్స్ అనే పదం ఏర్పడింది.
ఆ తరువాతి కాలం నుండి ఇప్పటి వరకు ఎన్నోరకాలైన విటమిన్స్ కనుగొనబడినవి. 1915 లో 'మెకల్లమ్' వీటిని రెండు భాగాలుగా వర్గీకరించారు.
అవి.
- క్రొవ్వులో కరిగే విటమిన్లు (Fat Soluble)
- నీటిలో కరిగే విటమిన్లు (Water Soluble)
![]() |
vitamins list in telugu, vitamins chart in telugu, |
క్రొవ్వులో కరిగే విటమిన్లు:-
విటమిన్ - A
విటమిన్ - D
విటమిన్ - E
విటమిన్ - K
విటమిన్ - A
విటమిన్ - A యొక్క రసాయన నామం 'రెటినాల్'. దీనిని 'యాంటి జిరప్తాల్మియా' అని కూడా అంటారు.
ఉపకళా కణజాలాలు ఉత్తేజితంగా ఉండడానికి, పిల్లలలో సాదారణ పెరుగుదలకు, కంటి చూపు మాములుగా ఉంచడంలో విటమిన్ - A ముఖ్యపాత్ర వహిస్తుంది. కంటి నేత్రపటలంలో రోడోప్సిన్ పునఃసంశ్లేషణకు ఇది అత్యావసరం.
విటమిన్ - A లోపం వల్ల కలిగే వ్యాధులు
జిరప్తాల్మియా (పొడి కళ్ళు) - కంటిలోని అశ్రుగ్రంధులు అస్రువులను ఉత్పత్తి చేయవు. ఫలితంగా కంటిపొర పొడిబారి పోతుంది.
కెరటోమలేసియ - కంటిలోని అశ్రుగ్రంధులు అస్రువులను ఉత్పత్తి చేయకుండా పొడిబారిపొతే కంటిలోని నల్లని గ్రుడ్డు (కార్నియా) కూడా పగిలిపోతుంది.
చర్మం గరుకుగా, పొలుసుబరి పోతుంది.
విటమిన్ -A ఉత్పత్తి వనరులు
చేప కాలేయపు నునే, పాలు, వెన్న, గుడ్డు పచ్చసొన, క్యారెట్, బొప్పాయి, అవకాడో, మామిడి, స్వీట్ పొటాటో, గుమ్మడికాయ, ఆకుకురలలో (బచ్చలకూరలో) ఉంటుంది. మొక్కలలో ఇది బీటా-కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఇది కాలేయం, ప్రేగులలో విటమిన్ A గా మారుతుంది. ఈ A - విటమిన్ వల్ల క్యారెట్ ఎరుపు రంగులోను , పామాయిల్ పసుపు రంగులో ఉంటాయి
విటమిన్ - D
విటమిన్ - D యొక్క రసాయన నామం 'కాల్సిఫెరోల్'. దీనిని 'సన్ షైన్ విటమిన్' 'ఫ్రీ విటమిన్' లేదా 'యాంటి రికెట్స్' అని కూడా అంటారు.
స్త్రీలు గర్బవతులుగా ఉన్నప్పుడు విటమిన్ - D పుష్కలంగా తీసుకుంటే పుట్టబోయే పిల్లల కండరాలు శక్తివంతంగా ఉంటాయని యూనివర్సిటీ అఫ్ సౌతాంప్టన్ పరిశోధకులు తేల్చారు.
విటమిన్ - D లోపం వల్ల కలిగే వ్యాధులు
రికెట్స్ వ్యాది - దీని కారణంగా చిన్న పిల్లల ఎముకలు పెళుసుగా మారి విరిగిపోతాయి.
విటమిన్ - D ఉత్పత్తి వనరులు
సూర్యోదయ సమయంలో సూర్యుని నుండి వచ్చే సూర్యకిరణాలలో ఉండే 'UV-rayes', తాజా కూరగాయలు, కమలాపండ్లు, వెన్న, పాలు, పెరుగు, గుడ్డు, కాడ్ లివర్ ఆయిల్, ఓట్స్, సుసంపన్నమైన వనస్పతి ల నుండి లభిస్తుంది.
విటమిన్ - E
విటమిన్ - E యొక్క రసాయన నామం 'టోకోఫెరోల్'. దీనిని 'బ్యూటి విటమిన్', మరియు 'యాంటి స్టెరిలిటీ' లేదా 'వంద్యత్వ విటమిన్' అని కూడా అంటారు.
కాన్సర్ మరియు గుండె జబ్బులను నివారించడంలో ఇది 'యాంటిఆక్సిడెంట్' పాత్ర పోషిస్తుంది.
విటమిన్ - E లోపం వల్ల కలిగే వ్యాధులు
పురుషులలో వంద్యత్వము, స్త్రీలలో గర్బశ్రావం వంటి లోపాలు ఏర్పడుతాయి. ఎర్రరక్త కణాల జీవిత కాలం తగ్గడం, కండరాల క్షీణత వంటి రుగ్మతలు కలుగుతాయి.
విటమిన్ - E ఉత్పత్తి వనరులు
కూరగాయలు, మొలకెత్తిన గింజలు, తాజా పండ్లు, ప్రొద్దుతిరుగుడు నూనె, ప్రత్తి గింజల నూనె, మాంసం, గుడ్లు, చేపలు, మరియు తృణదాన్యాలు, బాదాం, పిస్తా గోధుమలు, మొదలైనవి.
విటమిన్ - K
విటమిన్ - K యొక్క రసాయన నామం 'ఫైల్లోక్వినాన్', దీనిని 'యాంటి హెమరేజ్ విటమిన్' అని కూడా అంటారు.
శరీరానికి గాయాలు తగిలినప్పుడు రక్తస్రావం అవ్వకుండ ఈ "k" విటమిన్ రక్తాన్ని గడ్డకట్టిస్తుంది. 'డైసి డామ్' అనే శాస్త్రవేత్త దీనిని కనుగొన్నారు. విటమిన్ - K రెండు రూపాలలో ఉంటుంది. ఒకటి విటమిన్ - K1 (ఫైల్లోక్వినాన్) ఇది మొక్కల నుండి లభిస్తుంది. మరియొక రకం విటమిన్ - K2 (మోనాక్వినాన్) ఇది సహజంగానే మానవ ప్రేగులలో సంశ్లేషణ చెందుతుంది.
విటమిన్ - K లోపం వల్ల కలిగే వ్యాధులు
అధిక రక్తస్రావం, సులువుగానే కమిలిన గాయాలు ఏర్పడడం, మూత్రంలో రక్తం పడడం, ఎముక బలహీన పడడం, దద్దుర్లు, వేగవంతమైన హృదయ స్పందన.
విటమిన్ - K ఉత్పత్తి వనరులు
ఆకుకూరలు, బ్రోకలీ మరియు క్యాలిఫ్లవర్, పచ్చి బఠానీలను, గుడ్లు, చీజ్. అంతేకాకుండా కాలేయం, మూత్రపిండాలు, ఇంకా మానవుని ప్రేగులలో ఉండే Useful బ్యాక్టీరియ (E-coli) "k" విటమిన్ ని తయారుచేస్తుంది.
B2-విటమిన్ B7-విటమిన్
B3-విటమిన్ B9-విటమిన్
B5-విటమిన్ B12-విటమిన్
నీటిలో కరిగే విటమిన్లు:-
B- కాంప్లెక్స్ విటమిన్స్
B1-విటమిన్ B6-విటమిన్B2-విటమిన్ B7-విటమిన్
B3-విటమిన్ B9-విటమిన్
B5-విటమిన్ B12-విటమిన్
C-విటమిన్
B1-విటమిన్
విటమిన్ - B1 యొక్క రసాయన నామం 'దియమిన్'. దీనిని 'యాంటి నురియటిక్స్' విటమిన్' లేదా 'యాంటి బెరి బెరి విటమిన్' అని కూడా అంటారు.
ఇది కార్బోహైడ్రేట్ ల నుండి శక్తిని విడుదల చేయడానికి సహాయపడుతుంది. గుండె, జీర్ణ వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థ పనితీరుకు అవసరం. దీనీలో సల్ఫర్ అనే మూలకం ఉంటుంది. బియ్యం మరియు గోదుమలను ఎక్కవగా పాలిష్ చేయడం వలన వాటిపై ఉండేటటువంటి తవుడు లో గల విటమిన్స్ ని కోల్పోవడం జరుగుతుంది.
విటమిన్ - B1 లోపం వల్ల కలిగే వ్యాధులు
గుండెకు సంభందించిన వ్యాధులు, నాడీ మండలానికి అపస్రవ్యత ఏర్పడడం, మూర్చ వ్యాది, కండరాల క్షీణత, అలసట, ఆకలి మొదలైనవి. బెరి బెరీ అనే వ్యాది - హృదయ స్పందనలను క్రమరహితం చేస్తుంది, పాలి న్యురైటిస్ అనే వ్యాది కూడా కలుగుతుంది,
విటమిన్ - B1 ఉత్పత్తి వనరులు
చిక్కుడు, తృణధాన్యాలు, వేరుశనగ, పాలు, మాంసం, గుడ్లు, ఈస్ట్ సారం (ఉదాహరణకు వెజిమైట్)
B2-విటమిన్
విటమిన్ - B2 యొక్క రసాయన నామం 'రిబోఫ్లావిన్', దీనిని 'ఎల్లో ఎంజైమ్' అని కూడా అంటారు.
కణజాలాల పెరుగుదలకు మరియు మరమ్మత్తుకు ముఖ్యమైనది. ముఖ్యంగా చర్మం, కళ్ళు. ఆహరం నుండి శక్తిని విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఆవుపాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణం రిబోప్లావిన్.
విటమిన్ - B2 లోపం వల్ల కలిగే వ్యాధులు
నాలుక పై పూత(గ్లాసైటిస్), నోటి మూలలు పగలడం (కిలోసిస్).
విటమిన్ - B2 ఉత్పత్తి వనరులు
ఆవు పాలు, మాంసం, గుడ్లు, పుట్టగొడుగులు, తృణధాన్యాలు, ఆకుపచ్చ కూరగాయలు, కాలేయం, మొలకెత్తిన విత్తనాలు.
B3-విటమిన్
విటమిన్ - B3 యొక్క రసాయన నామం 'నియాసిన్', దీనిని 'యాంటి పెల్లాగ్ర' లేదా 'నికోటినిక్ ఆమ్లం' అని కూడా అంటారు.
విటమిన్ - B3 లోపం వల్ల కలిగే వ్యాధులు
చర్మం పై చిన్న చిన్న మచ్చలు ఏర్పడుతాయి. వీటిని డెర్మటైటిస్ అంటారు. చర్మం పై పొర పొలుసులుగా ఊడిపోతుంది, మతిమరుపు కూడా వస్తుంది.
విటమిన్ - B3 ఉత్పత్తి వనరులు
మాంసం,పాలు, గుడ్లు,ఈస్ట్, చిలకడదుంపలు, వేరుశనగ మొదలైనవి.
B5-విటమిన్
విటమిన్ - B5 యొక్క రసాయన నామం 'పాంటోధినిక్ ఆమ్లం', దీనిని 'సర్వ విస్తృత విటమిన్' అని కూడా అంటారు.
కార్బోహైడ్రేట్లు , క్రొవ్వులు మరియు ప్రోటీన్లను శక్తిగా మార్చడానికి సహాయపడతాయి.
విటమిన్ - B5 లోపం వల్ల కలిగే వ్యాధులు
అరికాళ్ళ మంటలు, కీళ్ళవాతం
విటమిన్ - B5 ఉత్పత్తి వనరులు
చిలకడదుంపలు, పాలు, చేప, గుడ్లు, కాలేయం, తృణ ధాన్యాలు, మొదలైనవి.
B6-విటమిన్
విటమిన్ - B6 యొక్క రసాయన నామం 'పిరిడాక్సిన్', దీనిని 'యాంటి ఎనిమియా విటమిన్' అని కూడా అంటారు.
ఎర్రరక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.మెదడు యొక్క పనితీరు మరియు రోగనిరోధక వ్యవస్థ యొక్క ఆరోగ్యానికి ముఖ్యమైనది.
విటమిన్ - B6 లోపం వల్ల కలిగే వ్యాధులు
రక్తహినత (ఎనిమియా), ఉద్వేగము, నాడీ మండలంలో లోపాలు, చిన్న పిల్లల్లో మూర్చ వ్యాది లక్షణాలు.
విటమిన్ - B6 ఉత్పత్తి వనరులు
పాలు,గుడ్లు,మాంసం,ఆకుకూరలు,సోయా,తృణధాన్యాలు,
B7-విటమిన్
విటమిన్ - B7 యొక్క రసాయన నామం 'బయోటిన్', దీనిని 'H విటమిన్' అని కూడా అంటారు.
దీనీలో సల్ఫర్ అనే మూలకం ఉంటుంది.
విటమిన్ - B7 లోపం వల్ల కలిగే వ్యాధులు
కండరాల బలహీనతలు, నాడీ మండల రుగ్మతలు, మానసిక రుగ్మతలు.
విటమిన్ - B7 ఉత్పత్తి వనరులు
పప్పు గింజలు, కూరగాయలు.
B9-విటమిన్
విటమిన్ - B9 యొక్క రసాయన నామం 'ఫోలిక్ ఆమ్లం', దీనిని 'పొలసిస్' అని కూడా అంటారు.
గర్భిణి స్త్రీలకు ఎక్కువగా అవసరమయ్యే విటమిన్, దీనిలో ఫెర్రాస్ అనే మూలకం ఉంటుంది.
విటమిన్ - B9 లోపం వల్ల కలిగే వ్యాధులు
రక్తహినత, తెల్లరక్త కణాలు నష్టపోవడం, మానసిక రుగ్మతలు.
విటమిన్ - B9 ఉత్పత్తి వనరులు
ఆకుకూరలు, పండ్లు, సన్-ఫ్లవర్ సీడ్స్, పీనట్స్, లివర్, చేపలు.
B12-విటమిన్
విటమిన్ - B12 యొక్క రసాయన నామం 'సైనోకోబాలమిన్'. దీనీలో కోబాల్ట్ అనే మూలకం ఉంటుంది.చిన్న ప్రేగులలో సంశ్లేషణ చేయబడుతుంది.
విటమిన్ - B12 లోపం వల్ల కలిగే వ్యాధులు
హానికర రక్తహినత, పెర్నిసియ ఎనిమియా.
విటమిన్ - B12 ఉత్పత్తి వనరులు
పాలు, గుడ్లు, మాంసం, లివర్. బలవర్ధకమైన సోయా ఉత్పత్తులు.
C-విటమిన్
విటమిన్ - C యొక్క రసాయన నామం 'ఆస్కార్బిక్ ఆమ్లం' అంటారు. దీనిని 'యాంటి స్కర్వి' అని కూడా అంటారు.
ఆరోగ్యకరమైన చర్మం, చిగుళ్ళు, దంతాలు, ఎముకలు, మరియు మృదులాస్థికి అవసరం. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలోను, గాయాలను తగ్గించడంలోను "C - విటమిన్" సహాయపడుతుంది. వేడి చేసినప్పుడు వెంటనే నశించిపోయే విటమిన్.
విటమిన్ -C లోపం వల్ల కలిగే వ్యాధులు
స్కర్వి అనే వ్యాది. దంతక్షయం, దంత వాపులు, జాయింట్ పెయిన్, అలసట, హెయిర్ మరియు స్కిన్ స్ట్రక్చర్ మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
విటమిన్ - C ఉత్పత్తి వనరులు
సిట్రస్ జాతి పండ్లు(నిమ్మ, బత్తాయి మొదలైనవి), ఉసిరి, జామ, మామిడి, టమాటో, బొప్పాయి, పాలకూర, క్యాబేజీ మొదలైనవి.
Comments
Post a Comment