ఈ మధ్యకాలంలో ఎక్కువగా టీవీల్లోను, న్యూస్ పేపర్ లలో, ప్లాస్మా, ప్లాస్మా థెరపీ అన్న పదాలను విని లేదా చూసే ఉంటారు. మరియు చాల మంది సెలబ్రిటిస్ కూడా ప్లాస్మా డొనేట్ చెయ్యండి అని చెప్పడం కూడా వినే ఉంటారు. రెండు రోజుల క్రితం "మెగాస్టార్ చిరంజీవి" గారు కూడా ప్లాస్మా థెరపీ గురించే ప్రస్తావించారు.
కానీ చాలామంది ప్రజలకి అసలు ప్లాస్మా మరియు ప్లాస్మా థెరపీ గురించి తెలియనే తెలియదు. విచిత్రం ఏమిటంటే! కొంతమంది డాక్టర్స్ కి కూడా ఈ ప్లాస్మా థెరపీ గురించి తెలియదు. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం.
ప్రస్తుత పరిస్తితులలో ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ను నియంత్రించడానికి ప్రపంచ దేశాలు అనేక రకాల పరిశోదనలు చేపడుతున్నాయి.
అసలు ఈ ప్లాస్మా మరియు ప్లాస్మా థెరపీ అంటే ఏమిటో చూద్దాం.
ఎవరైనా ఒక వ్యక్తీ వైరస్ ఇన్ఫెక్షన్ కి గురయినప్పుడు అతనియొక్క వ్యాది నిరోధక వ్యవస్థ లోని అంటే రక్తంలోని బి-సెల్స్ లేదా బి-లింఫోసైట్స్ కణాలు కొన్ని యాంటి బాడీస్ అనగా కొన్ని రకాల ప్రోటీన్లను విడుదలచేస్తాయి. ఇవి వైరస్ తో పోరాడి వైరస్ ను నాశనం చేయాడానికి సహాయపడతాయి. ఆ రోగి వైరస్ భారి నుండి రికవరీ అయిన తరువాత కూడా అతని రక్తం లోని ప్లాస్మా లో ఈ యాంటి బాడీస్ అనేవి కొంతకాలంపాటు ఉంటాయి. వైరస్ నుండి కోలుకున్న వ్యక్తీ యొక్క రక్తాన్ని సేకరించి ఆ రక్తం నుండి ఆస్పెరిసిస్ విధానం ద్వారా ద్వారా తెల్లరక్త కణాలు, ఎర్రరక్త కణాలు, మరియు ప్లేట్-లైట్స్ లు లేకుండా మిగిలిన పసుపు రంగు గల ద్రావణన్ని సేకరిస్తారు. దీనినే ప్లాస్మా అని పిలుస్తారు. మిగిలిన రక్త కణాలు దాత శరీరంలో వెళ్ళిపోతాయి. వైరస్ వల్ల సీరియస్ కండిషన్ తో భాదపడుతున్న పేషెంట్ కి ICCU (Intensive Coronory Care Unit) లో ఈ ప్లాస్మా ను ఇవ్వడం ద్వారా రికవరీ అవుతారన్నది సైద్డంతికంగా నిరూపించబడింది. ఇలా చేసే ప్రక్రియనే ప్లాస్మా థెరపీ అని అంటారు.
20 వ శతాబ్దపు ప్రారంభంలోనే ఈ ప్లాస్మా థెరపీ పై అనేక ప్రయోగాలు జరిగాయి. అయితే ఆ తరువాతికాలంలో యంటి బయోటిక్ డ్రగ్స్ అబివృద్ది చేయడంతో ఈ ప్రక్రియ మరుగున పడిపోయింది. కాని 2002 లో వచ్చిన సార్స్, మరియు 2013 లో వచ్చిన ఎబోలా వంటి వ్యాధులు మందులకు లొంగని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ ప్లాస్మా థెరపీ తెర పైకి వచ్చింది. ఐతే ఈ ప్లాస్మా థెరపీ ఇన్ఫెక్షన్లను పూర్తిగా నయం చేయకపోయినప్పటికీ వ్యాది సోకిన వారు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. పైన తెలిపిన వ్యాదులలో ప్లాస్మా థెరపీ ప్రక్రియ కొంతవరకు సత్పలితాలను ఇచ్చిన నేపధ్యంలో ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్న కరోన వైరస్ విషయంలో కూడా ఈ ప్రక్రియను ఉపయోగిస్తున్నారు. మన దేశంలో కూడా "ICMR (Indian Council of Medical Research)" ఈ వైరస్ విషయంలో ప్లాస్మా థెరపీ కి అనుమతిని ఇచ్చింది.
ఐతే ఈ ప్లాస్మా థెరపీ ని ప్రయోగించడానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒక వ్యక్తీ నుండి ప్లాస్మా ని సేకరించాలంటే ఆ వ్యక్తి యొక్క వయస్సు, ఆరోగ్య స్థితి మొదలైనవి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దాతల వయస్సు 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. దాత వ్యాది నుండి కోలుకొని కనీసం 14 రోజుల సమయం గడవాలి.
ప్లాస్మా ను దానం చేయదలిచే దాత శరీరానికి ప్లాస్మో ఫేరిసిస్ అనే పరికరాన్ని అమర్చి సుమారు 800 మిల్లిలీటర్ల వరకు ప్లాస్మా ని సేకరిస్తారు. దీనికి సుమారుగా రెండు గంటల సమయం పడుతుంది. అలా ఒక్క దాత నుండి తీసిన ప్లాస్మా తో నలుగురికి చికిత్స అందించవచ్చు. ఈ ప్లాస్మా ను రోగికి నేరుగా ఎక్కించవచ్చు. దీనిని -30 డిగ్రీల సెంటిగ్రేట్ వద్ద ఒక సంవత్సరం పాటు భద్రపరచవచ్చు.
ఒక రోగికి సుమారు 200 మిల్లిలీటర్ల ప్లాస్మా అవసరంపడుతుంది. ప్లాస్మా గ్రహీతలందరు ఈ ప్లాస్మా పక్రియకు ఒకేలా స్పందించరు. కొంతమందిలో ఈ ప్లాస్మా ఎక్కించినప్పుడు కొన్ని ఇబ్బందులు లేదా ఎలర్జిక్ రియాక్షన్ లు సంభవించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఏదిఏమైనప్పటికీ
మందులకు లొంగని వైరస్ లను అదే వైరస్ నుండి బయట పడిన వ్యక్తి రక్తం లోని ప్లాస్మా ద్వారా అంతమొందిచొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు .

JackpotCity Casino Site » 50% Up To ₹100000 Bonus + 80 Free Spins
ReplyDeleteThe JackpotCity casino is the best online gambling platform available on the internet. The site offers players a variety of welcome luckyclub offers. There is a huge