![]() |
why do apples turn brown - Image by Myriam Zilles from Pixabay |
సాదారణంగా ఆపిల్ పండుని కోసిన తరువాత ఆ ముక్కలు ఒక రకమైనటువంటి బ్రౌన్ రంగులోకి మారడాన్ని మనం గమనిస్తాం. అలా మారడానికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం.
ఆపిల్ పండులో పోలిఫినాల్ ఆక్సిడైస్ (PPO) అనే ఎంజైమ్ మరియు ఫినాలిక్ కాంపౌండ్ ఉంటాయి. ఈ PPO మరియు పొలిఫినాల్స్ ఆపిల్ లోపల వేర్వేరు కణాలలో ఒకదానితో మరొకటి కలవకుండా ఉంటాయి. మనం ఆపిల్ పండును ముక్కలుగా కోసినప్పుడు ఆపిల్ లోని కణాలు డామేఙ్ అవ్వడం వల్ల పొలిఫినాల్ అనే ఎంఙైము, మరియు పోలిఫినాల్స్ ఒకదానితో మరొకటి కలుస్తాయి, అదే సమయంలో వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ తో ఆపిల్ పండులో ఉండేటటువంటి పొలిఫినాల్స్ కలసి ఎంఙైమ్ సహయంతో ఒక రసాయన చర్య జరుపుతాయి. ఈ చర్యనే ఆక్సీకరణ చర్య లేదా ఆక్సీడేషన్ అంటారు. ఈ ఆక్సికరణ చర్య వలన మెలనిన్ అనే వర్ణద్రవం ఏర్పడుతుంది. సాధారణంగా మెలనిన్ బ్రౌనిష్ కలర్ లో ఉండటం వలన ఆపిల్ ముక్కలు బ్రౌన్ రంగులో కి మారుతాయి.
ఆపిల్ ముక్కలు రంగు మారకుండా ఉండాలంటే?
కోసినటువంటి ఆపిల్ ముక్కలు అలా బ్రౌన్ రంగులోకి మారకుండా ఉండాలంటే, ఆ కోసినటువంటి ఆపిల్ ముక్కలపై కొద్దిగా నిమ్మరసం పిండితే,
![]() |
lemon squeeze Photo by Lisa Fotios from Pexels |
ఆ నిమ్మరసం లో ఉండేటటువంటి సిట్రిక్ ఆసిడ్ ఆపిల్ పండులో ఉండేటటువంటి పోలిఫినాల్స్ మీద ఒక పొరలాగ ఏర్పడుతుంది. తద్వారా పొలిఫినాల్స్ పై ఆక్సిజన్ రసాయన చర్య జరపడానికి వీలుపడదు. కాబట్టి ఆపిల్ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి.
nice
ReplyDeletevery informative
ReplyDeletePeople ought to never make compromises or lose small bets 퍼스트카지노 outcome of|as a end result of} they'll obtain large issues occasion that they} work collectively. As a end result, individuals ought to begin small and progressively enhance their stakes. It’s a mistake to try for bigger prizes whereas ignoring smaller ones. In Punto Banco the player can guess on their very own hand , the banker’s hand , or a tie.
ReplyDelete