ప్రొద్దు తిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యుని దిశగా ఎందుకు తిరుగుతుంది? - why sunflowers follow the sun?
![]() |
|
ప్రొద్దు తిరుగుడు పువ్వు, ఈ పువ్వు గురించి తెలియనివారుండరు. ఈ ప్రొద్దు తిరుగుడు పువ్వు కి ఒక ప్రత్యేకత ఉంది. అది ఎంటంటే! సూర్యుడు ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు సూర్యుడు వైపే చూస్తూ ఉంటుంది. అంటే సూర్యుని యొక్క ప్రొద్దు ఎటువైపు తిరిగితే ఆ పువ్వు కూడా అటువైపు తిరుగుతూ ఉంటుంది. అందుకే వీటిని ప్రొద్దు తిరుగుడు పువ్వులు అంటారు. అంతేకాకుండా వీటిని సుర్యకాంత పుష్పాలు అని కూడా పిలుస్తారు. ఐతే ఈ ప్రొద్దు తిరుగుడు పువ్వులు అలా సూర్యుడు ఎటువైపు తిరిగితే అటువైపు తిరగడానికి గల కారణం చాల మందికి తెలియకపోవచ్చు, ఐతే దానికి గల కారణం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం.
సన్-ఫ్లవర్ సన్ ఉన్న వైపుకే ఎందుకు తిరుగుతుంది?
సైన్స్ ప్రకారం ప్రొద్దు తిరుగుడు పువ్వు సూర్యుని వైపు తిరగడానికి గల కారణం, ఆ మొక్కలో ఉండే ఫోటోట్రాఫిజం. సాదారణంగా మొక్కల పెరుగుదలకు సూర్యరశ్మి అవసరమవుతుంది. ఈ సూర్యరశ్మి కారణంగానే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. మొక్కలు పెరుగుదలతో పాటు సూర్యరశ్మికి ప్రతిస్పందించే చర్యను ఫోటోట్రాఫిజం పెంపొందిసస్తుంది. ప్రొద్దు తిరుగుడు పువ్వులో ఉన్నటువంటి అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్ లు విచ్చిన్నం అయ్యి ఆక్సిన్ అనే హార్మోన్ ఏర్పడుతుంది. ఇది మొక్క పెరుగుదలకు సహాయ పడుతుంది. ఈ ఆక్సిన్ హార్మోన్ కారణంగా ప్రొద్దు తిరుగుడు పువ్వు సూర్యుని వైపు తిరుగుతుంది. సూర్య కాంతి పడని భాగంలో ఈ ఆక్సిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అంటే పువ్వు సూర్యుని వైపు తిరిగి ఉన్నప్పుడు అ పువ్వు యొక్క వెనుక భాగంలో నీడలో ఆక్సిన్ ఉత్పత్తి అవుతుంది. దీనివలన ఆ భాగం త్వరగా పెరిగి పువ్వు కదులుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రొద్దు తిరుగుడు పువ్వు కాడలలోని మూలా కణాల ప్రత్యేక ఎదుగుదల వల్లే సన్-ఫ్లవర్ సూర్యునికి అభిముఖంగా తిరుగుతూ ఉంటుంది. పువ్వు సూర్యుని నుండి వచ్చే సూర్య కిరణాలను గ్రహించడం కారణంగానే ఈ ప్రక్రియ జరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ప్రొద్దు తిరుగుడు పువ్వు వల్ల ఉపయోగాలు:
ప్రొద్దు తిరుగుడు పువ్వు ద్వారా వచ్చే నునేను సౌందర్య సాధనాలు మరియు చర్మ రక్షణకు సంభందించిన కొన్ని మెడిసిన్ లలో వాడుతారు. వీటిలో ఉండే "విటమిన్-ఇ" కోలాన్ కాన్సర్, డయాబెటిస్ లకు నేచురల్ రెమెడి గా ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా ప్రొద్దు తిరుగుడు పువ్వు మధ్య భాగంలో నుండి తీసే విత్తనాలు తినడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్ మరియు ఫ్యాటి ఆసిడ్స్ మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
![]() |
sunflower seeds - Image by Natthapat Aphichayananthanakul from Pixabay |
ఈ విత్తనాలలో ఉండే మెగ్నీషియం ఎముకలు గట్టి పడేందుకు ఉపయోగపడుతుంది. ఈ గింజలలో ఉండే కాపర్ ఎముకల యొక్క జాయింట్లు బాగా పనిచేసేలా చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ విత్తనాలలో ఉండే "జింక్", మరియు "విటమిన్-ఇ" వ్యాది నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఈ విత్తనాలు గుండెకు కుడా చాలా మేలు చేస్తాయి, గుండె ధమనులలో క్రొవ్వు పెరగకుండా అడ్డుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది. ఈ సన్-ఫ్లవర్ సీడ్స్ మనం ఊపిరి పీల్చుకునేటప్పుడు మరియు వదిలేటప్పుడు ఎదుర్కొనే సమస్యలను నయం చేస్తాయి. రకరకాల ఇన్ఫెక్షన్ ల నుండి కాపాడేందుకు ఈ సన్-ఫ్లవర్ సీడ్స్ ఉపయోగపడతాయి.
Comments
Post a Comment