టూత్ పేస్ట్ ట్యూబ్ పై కలర్ కోడ్స్ ఎందుకు ఉంటాయి? - WHY THERE ARE DIFFERENT COLOR CODES ON THE TOOTHPASTE TUBE?
![]() |
why there are different color codes on the toothpaste tube |
ప్రతీ ఒక్కరు ఉదయం లేవగానే వారియొక్క దంతాలు శుభ్రపరుచుకుంటారు. దంతాల యొక్క సంరక్షణ అందరికీ చాలా ముఖ్యం. పూర్వకాలంలో పళ్ళు త్రోముకోవడానికి వేప పుల్లల్లు, ఉప్పు మరియు చార్-కోల్ పౌడర్ మొదలైనవి ఉపయోగించేవారు. కాలక్రమేనా వాటి యొక్క వాడకం తగ్గి టూత్ పేస్ట్ వాడకం ఎక్కువైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో రకాలైన దేశీయ, విదేశీ కంపెనీలకు చెందిన టూత్ పేస్ట్ లు మార్కెట్ లో చలామణి అవుతున్నాయి. కొంతమంది కంపెనీ బ్రాండ్ చూసి విదేశీ టూత్ పేస్ట్ లు కొనుగోలు చేస్తుంటే, మరికొందరు దేశీయ బ్రాండ్ ల మీదే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ఇలా ఎవరికి నచ్చిన బ్రాండ్ లు వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఐతే మనం ఉపయోగిస్తున్న టూత్ పేస్ట్ ట్యూబ్ ల మీద క్రింది భాగాన్ని పరిశిలించినట్లయితే అక్కడ వివిధ రంగులలో చిన్నగా, లావుగా ఉన్న గీతలాంటి గుర్తును గమనించే ఉంటారు. అవి ఒక్కొక్క ట్యూబ్ మీద ఒక్కొక్క రకంగా ఉంటాయి. అవి ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, నీలం రంగులలో ఉంటాయి. వాటి గురించి తెలుసుకొనే ముందు అసలు సోషల్ మీడియా లో మరియు ఇంటర్నెట్ లలో ఈ టూత్ పేస్ట్ ట్యూబ్ లపై ఉండేటటువంటి కలర్ కోడ్స్ గురించి ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దాం.
సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ సమాచారం ప్రకారం టూత్ పేస్ట్ ట్యూబ్ పై కలర్ కోడ్స్ ఉండటానికి గల కారణం?
చాలా మంది వాటిని చూసి ఏదో డిజైన్ కోసం ఇచ్చారేమో అని అనుకుంటారు. కాని అలా రంగులతో కూడిన గీతలు డిజైన్ కోసం కాదు. అలా ఇవ్వడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం సాదారణంగా మార్కెట్ కి వెళ్లి టూత్ పేస్ట్ కొంటున్న సమయంలో మనం ఎక్కువగా గమనించేది ఎంటంటే? టూత్ పేస్ట్ లో ఉండేటటువంటి "Ingredients", ఆ టూత్ పేస్ట్ ద్వారా వచ్చే "Benefits", "Expiry Date" మరియు దాని టేస్ట్ కూడా దృష్టిలో పెట్టుకొనే టూత్ పేస్ట్ లు కొనుగోలు చేస్తుంటాం. ఐతే వాటి మీద ఉండే కలర్ కోడ్ ని మాత్రం పట్టించుకోం. ఐతే ఈ కలర్ కోడ్ ప్రింట్ చేయడానికి గల కారణం ఎంటంటే, సదరు టూత్ పేస్ట్ ను ఏ పదార్ధంతో తయారు చేసారో మరియు ఆ టూత్ పేస్ట్ సహజసిద్దమైనదో కాదో తెలుసుకోవచ్చు.
పైన తెలిపిన ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, నీలం రంగుల గురించి తెలుసుకుందాం.
నలుపు:
టూత్ పేస్ట్ క్రింది భాగంలో నలుపు రంగు ఉన్నట్లయితే దానిని వందశాతం కెమికల్స్ తో తయారుచేసినట్లు.
ఆకుపచ్చ:
టూత్ పేస్ట్ క్రింది భాగంలో ఆకుపచ్చ రంగు ఉన్నట్లయితే దానిని సహజసిద్దం గా తయారుచేసినట్లు.
నీలం:
టూత్ పేస్ట్ క్రింది భాగంలో నీలం రంగు ఉన్నట్లయితే దానిని సహజసిద్దమైన మరియు ఔషధాలతో తో తయారుచేసినట్లు
ఎరుపు:
టూత్ పేస్ట్ క్రింది భాగంలో ఎరుపు రంగు ఉన్నట్లయితే దానిని సహజసిద్దమైన మరియు కెమికల్స్ తో తయారుచేసినట్లు
ఇప్పటినుండి మీరు టూత్ పేస్ట్ కొనేముందు వాటిపై ఉండే ఈ కలర్ కోడ్స్ ని చూసి కొనుగోలు చేయండి.
పైన తెలిపిన విధంగా ఏ సోషల్ మీడియా లోనో, మరేఇతర ఇంటర్నెట్ Platforms లోనైనా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ కరెక్ట్ కాదు. వాటిల్లో చెప్పిన విధంగా టూత్ పేస్ట్ ట్యూబ్ క్రింది భాగంలో ఇచ్చే కలర్ కోడ్స్ ఆధారంగా అవి ఎటువంటి పదార్దాలతో తయారుచేస్తారు అన్న విషయం పూర్తిగా అవాస్తవం.
సాదారణంగా సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ లలో ఉండేటటువంటి సమాచారం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. "Internet", "Smartphones" మరియు "Social Media" లు వచ్చాక ప్రపంచం మొత్తం మానవుని అరచేతిలోకి వచ్చినట్లయింది. వీటి ద్వారా మనం పొందే సమాచారం కొంత వరకు కరెక్ట్ అయినప్పటికి, ఈ టూత్ పేస్ట్ ట్యూబ్ పై గల కలర్ కోడ్స్ అనుసరించి అవి ఏ పదార్దాలతో తయారుచేస్తారు అనే సమాచారం కరెక్ట్ కాదని, టూత్ పేస్ట్ రంగంలో అగ్రగామి కంపెనీగా పేరుగాంచిన "Colgate" తన యొక్క అధికారక వెబ్ సైట్ లో క్లుప్తమైన ఒక ఆర్టికల్ ని పొందుపరిచింది. ఆ ఆర్టికల్ ప్రకారం సోషల్ మీడియా లో కలర్ కోడ్స్ పై వస్తున్న వదంతులు వలన చాల మంది ప్రజలు ఆ అసత్యపు సమాచారాన్ని నిజమనుకొని నలుపు లేదా ఎరుపు రంగులలో ఉన్నటువంటి టూత్ పేస్ట్ లు కెమికల్స్ తో తయారవుతాయని ఆకుపచ్చ లేదా నీలం రంగులో ఉన్న టూత్ పేస్ట్ లు సహజసిద్దమైనవని కేవలం వీటిని మాత్రమే ఎంచుకోవాలని ఆ అసత్యపు పోస్టులు ప్రోత్సహిస్తున్నాయి పేర్కొంది.
టూత్ పేస్ట్ ట్యూబ్స్ పై కలర్ కోడ్స్ ఉండడానికి గల అసలు కారణం?
కలర్ కోడ్స్ కి మరియు టూత్ పేస్ట్ సూత్రీకరణకు అసలు ఎటువంటి సంభందం లేదు, ఇవి కేవలం టూత్ పేస్ట్ ఉత్పత్తి చేసే సమయంలో వాటిని తయారు చేసే మిషిన్స్ ఆ ట్యూబ్స్ ని గుర్తించి ఎంత వరకు ట్యూబ్ ని కట్ చేసి సీల్ చేయాలి అనే దాని కోసమే ఈ కలర్ కోడ్స్ ని ట్యూబ్ యొక్క క్రింది భాగంలో ప్రింట్ చేసారు. మిషిన్స్ లో ఉండేటటువంటి లైట్ బీమ్ సెన్సార్స్ ఆ కలర్ బార్స్ ని గుర్తించి ట్యూబ్ ను కట్ మరియు సీల్ చేయవలసిన భాగాన్ని ఇన్ఫర్మేషన్ రూపంలో మిషిన్స్ కు అందజేస్తాయి.
ఒకవేళ మీరు కొనుగోలు చేసే టూత్ పేస్ట్ యొక్క "Ingredients" తెలుసుకోవాలంటే దానికి ఇచ్చేటటువంటి బాక్స్ మీద ప్రింట్ చేయబడి ఉంటాయి.
మీ రిఫరెన్స్ కోసం "Colgate" కంపెనీ ప్రచురితం చేసిన ఆర్టికల్ యొక్క లింక్ క్రింది పేర్కొనబడినడది.
kash ye hindi me hota
ReplyDelete