అంతర్జాతీయ వేదికపై మెరిసిన తొలి మహిళా నటి జొహ్రా సెహ్గల్ యొక్క జీవిత విశేషాలు - BIOGRAPHY OF ZOHRA SEHGAL, THE FIRST FEMALE ACTRESS TO SHINE ON THE INTERNATIONAL STAGE
జొహ్రా సెహ్గల్ - ఈమె ఒక భారతీయ దిగ్గజ నటి, మరియు రంగస్థల కళాకారిణి. ఈమె 1912 ఏప్రిల్ 27న ముంతాజుల్లా ఖాన్, నాటికా బేగం దంపతులకు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో ఒక సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఈమె చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తన సోదరి తో కలిసి లాహోర్ లోని క్వీన్ మేరి కాలేజి లో చదివారు. తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత ఎడిన్బర్గ్ లో ఉన్న తన మామ సాహెబ్జాదా సయీదుజ్జఫార్ ఖాన్ ఈమెను ఒక బ్రిటిష్ నటుడి దగ్గర అప్రెంటిస్ గా చేర్చారు.
ఈమె ఆగష్టు 8, 1935 న ఉదయ్ శంకర్ బృందంలో నర్తకిగా కెరీర్ ప్రారంభమైనది. 1935 నుండి 1943 వరకు, ఆమె బృందంతో కలిసి యుఎస్ఎ మరియు జపాన్లతో సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శన ఇచ్చింది. 1940 లో అల్మోరాలోని ఉదయ్ శంకర్ ఇండియా సాంస్కృతిక కేంద్రంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. ఇక్కడే తనకు కాబోయే భర్త, యువ శాస్త్రవేత్త, చిత్రకారుడు అయిన కామేశ్వర్ సెగల్ ను కలుసుకున్నారు. ఈ జంట అల్మోరాలోని ఉదయ్ డాన్స్ ఇన్స్టిట్యూట్లో పనిచేసి నిష్టాతులైన నృత్యకారులు అయ్యారు. ఇది తరువాత ముసివేయబదడినప్పుడు, వారు సమీప పశ్చిమ భారతదేశంలోని లాహోర్ కు వలస వెళ్లి సొంతంగా జోహ్రేష్ డాన్స్ ఇన్స్టిట్యూట్ ని స్థాపించారు. 1959లో తన భర్త మరణించిన తరువాత ఢిల్లీలో స్థిరపడి, అక్కడ ఉన్న నాట్య అకాడమీకి డైరెక్టర్ అయ్యారు. ఈమె 1962 లో డ్రామా స్కాలర్‌షిప్ కోసం లండన్ కి వెళ్లి భరతనాట్య నర్తకి రామ్ గోపాల్ ను కలుసుకొని, 1963లో ప్రారంభించిన చెల్సియాలోని నృత్య పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసారు. 1982 లో జేమ్స్ ఐవరీ దర్శకత్వం వహించిన ది కోర్ట్సన్స్ ఆఫ్ బొంబాయి లో పనిచేసింది. ఈమె రాజ్ క్వార్టెట్, ది జ్యువెల్ ఇన్ ది క్రౌన్, తాండురి నైట్స్,మై బ్యూటిఫుల్ లాండ్రేట్ వంటి వాటిల్లో కనిపించింది. భాజీ ఆన్ ది బీచ్ మరియు హమ్ దిల్ దే చుకే సనమ్ వంటి వైవిద్యభరితమైన సినిమాల్లో కనిపించారు. ఆమె చివరిసారిగా 2007 లో విడుదలైన సావరియా అనే చిత్రంలో కనిపించారు.
ఈమెకు ఇద్దరు పిల్లలు. వారి పేర్లు కిరణ్ సెహ్గల్, పవన్ సెహ్గల్. పవన్ సెహ్గల్.WHO లో పనిచేస్తున్నారు. మరియు కిరణ్ సెహ్గల్ ఒడిస్సీ నర్తకి. 2012 లో, జొహ్రా సెహ్గల్ యొక్క జీవిత చరిత్రను తన కుమార్తె కిరణ్ సెహ్గల్ "జొహ్రా సెహ్గల్ ఫ్యాటి" పేరుతో రాసారు.
సెగల్ యొక్క ప్రారంభ రచనలలో "నీచా నగర్" (లోలి సిటి) చిత్రం 1946 లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో విడుదల అయ్యింది. బారతీయ సినిమా యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ విజయాన్ని విస్తృతంగా పరిగణించిన "నీచా నగర్" కేన్స్ ఫిలిం ఫెస్టివల్ యొక్క అత్యన్నత గౌరవం "Palme d'Or" బహుమతిని గెలుచుకుంది. అంతేకాకుండా ఈమె పద్మ శ్రీ, పద్మ భూషణ్, మరియు పద్మ విభూషణ్, అవార్డులను అందుకున్నారు.
ఈమె 60 ఏళ్ళకు పైగా కెరీర్ వ్యవధిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక బాలీవుడ్ చిత్రాలలో నటించింది. ఈమె యునైటెడ్ స్టేట్స్, జపాన్ వంటి దేశాలలో ప్రదర్సనలు చేసింది. ఈమె జూలై 10, 2014 న తన 102 ఏట గుండెపోటుతో మరణించారు.
గూగుల్ డూడుల్స్ మంగళవారం(29-09-2020) నాడు ఈమేకు నివాళులు అర్పించింది. ఈమె డాన్స్ చేస్తునట్లుగా చూపించిన ప్రత్యెక డూడుల్ ను గూగుల్ గెస్ట్ ఆర్టిస్ట్ పార్వతి పిళ్ళై రూపొందించారు.
Comments
Post a Comment