ఒకవేళ అలా కాదని మీరు ఆ గార్డెన్ లో ఉండే మొక్కలను గాని ముట్టుకోవాలని చూసినా, లేక వాసనా చూడాలని అనుకున్నా, ఆ మొక్కలు మిమ్మల్ని చంపేస్తాయి. అవునండి ఇది అక్షర సత్యం.
ఈ గార్డెన్ ఇంగ్లాండ్ లో నార్తంబర్లాండ్ లోని అల్న్‌విక్ కోటలోని 42 ఎకరాల తోటలలో ఒక చిన్న భాగం మాత్రమే, అయినప్పటికీ ఇది చాలా ప్రమాదకరమైనది. వీటిలో రిసిన్ మరియు స్ట్రైక్నైన్ నుండి కోకా వరకు మొక్కలను తాకడం గాని , వాసన చూడడం గాని , మరియు తినడం వంటివి చేయకూడదు.
చాలా మంది సందర్సకులు వాటిని చూడాలనే కుతూహలంతో వాటి దగ్గరకు వెళ్ళిమరీ చూస్తారనే ఉద్దేశ్యంతో అక్కడి అధికారులు ఈ విషపూరిత మొక్కలను బోనుల్లో ఉంచి పెంచుతారు. అలా పెంచడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి కూడా అవసరం.

ఈ పాయిజన్ గార్డెన్ 1996 లో నార్తంబర్లాండ్ యొక్క దొరసాని అయినటువంటి "జేన్ పెర్సీ" యొక్క ఆలోచన ఆమె ఆ కోటలో ఉన్నటువంటి తోటలను తిరిగి పునరుద్దరించమని తన భర్త ను కోరింది. అంతేకాకుండా ఆమె ఇటలీ లో "Padua" నగరంలో ఉన్న"Orto Botanico Di Padova" పాయిజన్ గార్డెన్ ద్వారా ప్రేరణ పొంది, అల్న్‌విక్ కోటలో కూడా పాయిజన్ మొక్కలను నాటడం ప్రారంభించింది.
"జేన్ పెర్సీ" యొక్క లక్ష్యాలలో ఒకటి పిల్లలకు వృక్షశాస్త్రం మరియు విజ్ఞానశాస్త్రం గురించి ఆసక్తి కలిగించే విధంగా అవగాహన కల్పించడం, మరియు అక్కడికి వచ్చే సందర్శకులకు కొన్ని రకాల మొక్కలు ఎంత ప్రమాదకరమైనవో తెలుసుకోవడానికి ఇది చాల ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ పాయిజన్ మొక్కలు కొన్ని రకాల ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
కొన్ని అత్యంత ప్రమాదకరమైన మొక్కలు
2) దతురా (ఉమ్మెత్త) - దీని కారణంగా మనిషి జీవితాంతం నిద్రాణమైన దశ లోకి వెళ్ళిపోతాడు.
3) అకోనైటిన్ - దీనికి మనుషుల ప్రాణాలను తీసే సామర్ధ్యం కలదు.
4) లారెల్ - ఇది సైనైడ్ ని విడుదల చేస్తుంది.
5) జెయింట్ హగ్వీడ్ - ఇది ఫోటోటాక్సిక్ ని కలిగి ఉంటుంది. దీని కారణంగా మన చర్మం మీద బొబ్బలు ఏర్పడుతాయి, ఈ బొబ్బలు చాలా కాలం పాటు మన శరీరం మీద ఉంటాయి.
Comments
Post a Comment