అంతర్జాతీయ వేదికపై మెరిసిన తొలి మహిళా నటి జొహ్రా సెహ్గల్ యొక్క జీవిత విశేషాలు - BIOGRAPHY OF ZOHRA SEHGAL, THE FIRST FEMALE ACTRESS TO SHINE ON THE INTERNATIONAL STAGE
జొహ్రా సెహ్గల్ - ఈమె ఒక భారతీయ దిగ్గజ నటి, మరియు రంగస్థల కళాకారిణి. ఈమె 1912 ఏప్రిల్ 27న ముంతాజుల్లా ఖాన్, నాటికా బేగం దంపతులకు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో ఒక సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఈమె చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తన సోదరి తో కలిసి లాహోర్ లోని క్వీన్ మేరి కాలేజి లో చదివారు. తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత ఎడిన్బర్గ్ లో ఉన్న తన మామ సాహెబ్జాదా సయీదుజ్జఫార్ ఖాన్ ఈమెను ఒక బ్రిటిష్ నటుడి దగ్గర అప్రెంటిస్ గా చేర్చారు. ఈమె ఆగష్టు 8, 1935 న ఉదయ్ శంకర్ బృందంలో నర్తకిగా కెరీర్ ప్రారంభమైనది. 1935 నుండి 1943 వరకు, ఆమె బృందంతో కలిసి యుఎస్ఎ మరియు జపాన్లతో సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శన ఇచ్చింది. 1940 లో అల్మోరాలోని ఉదయ్ శంకర్ ఇండియా సాంస్కృతిక కేంద్రంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. ఇక్కడే తనకు కాబోయే భర్త, యువ శాస్త్రవేత్త, చిత్రకారుడు అయిన కామేశ్వర్ సెగల్ ను కలుసుకున్నారు. ఈ జంట అల్మోరాలోని ఉదయ్ డాన్స్ ఇన్స్టిట్యూట్లో పనిచేసి నిష్టాతులైన నృత్యకారులు అయ్యారు. ఇది తరువాత ముసివేయబదడినప్పుడు, వారు సమీప పశ్చిమ భారతదేశంలోని లాహోర్ కు వలస వెళ్లి సొంతంగా జోహ్రేష్ డాన్స్ ఇన్స్టిట...