కంప్యూటర్ లో ఉండే F1 నుండి F12 వరకు గల ఫంక్షన్ కీస్ గురించి తెలుసుకోండి - Learn about the function keys from F1 to F12 on the computer
keyboard function keys f1 to f12 in Telugu ఫంక్షన్ కీ అంటే ఏమిటి? సాధారణంగా కంప్యూటర్ లేదా లాప్-టాప్ కీ-బోర్డ్ లలో ఫంక్షన్ కీస్ అనేవి ఉంటాయి. ఈ ఫంక్షన్ కీస్ అనేవి F1 తో మొదలయ్యి F12 వరకు ఉంటాయి. అనగా F1, F2, F3, F4, F5, F6, F7, F8, F9, F10, F11, F12. వీటిని "ఫంక్షన్ కీస్" లేదా "F Kyes" అని కూడా పిలుస్తారు. ఈ " F కీలు" ఆపరేటింగ్ సిస్టమ్ లేదా రన్ చేయబడుతున్న ప్రోగ్రామ్ చే నిర్వహించబడే ప్రత్యేక ఫంక్షన్ ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ F కీస్ కీ-బోర్డ్ లో ఉన్నటువంటి "Alt" లేదా "Ctrl" లతో అనుసంధానం చేసి ఉపయోగిస్తారు. కొన్ని రకాల కీ-బోర్డ్ లలో "F" కీలు స్క్రీన్ ను ప్రకాసవంతంగా మార్చడానికి లేదా తగ్గించడానికి లేదా సౌండ్ ని తగ్గించడానికి, పెంచడానికి మరియు వాటికి నిర్దేసించిన ఫంక్షన్ లను మార్చడం వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. ఐతే ఈ కీలను మీరు ప్రామాణిక ఫంక్షన్ కీ గా మార్చాలనుకుంటే కీ-బోర్డు లో ఎడమ వైపు ఇచ్చినటువంటి "Fn" కీ ని నొక్కి ఉంచి ఈ ఫంక్షన్ కీ ని నొక్కినట్లయితే ఆ ఫంక్షన్ కీ సేవ్ చేయబడి, మరియు ఆ ...